Sunday, 3 April 2016

తెలంగాణ తొలి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TS TET) పేపర్-1 - ప్రిపరేషన్ ప్లాన్

తెలంగాణ తొలి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TS TET) పేపర్-1 - ప్రిపరేషన్ ప్లాన్
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత విడుదలకానున్న తొలి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TS TET) కి కోలాహలం ఆరంభమైంది. ఎప్పుడా అని ఎదురుచూస్తున్న టెట్ నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఉపాధ్యాయ కొలువును చేజిక్కించుకోవాలంటే టెట్‌లో మంచి స్కోర్ సాధించాల్సిందే! ఉపాధ్యాయ వృత్తిని కెరీర్‌గా ఎంపిక చేసుకోవాలనుకునే అభ్యర్థులు NCTE నిబంధనల మేరకు తప్పనిసరిగా టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్)లో అర్హత సాధించాల్సిందే. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం టెట్ నిర్వహిస్తోంది. కొద్ది రోజుల్లో టెట్ నిర్వహణకు అధికారులు సిద్ధమవుతున్నారు. పరీక్ష విధానంపై, కొత్త సిలబస్‌పై నిరుద్యోగ ఉపాధ్యాయ లోకంలో అనేక సందేహాలతో కంగారు మొదలైంది. డీఈడీ, బీఈడీ, భాషా పండిత శిక్షణ, తత్సమాన అర్హత ఉన్న వారందరూ టెట్ రాయొచ్చు. ఎస్‌జీటీ అభ్యర్థులు పేపర్-1, స్కూల్ అసిస్టెంట్ ఔత్సాహికులు పేపర్-2లో అర్హత సాధించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో టెట్‌ ప్రిపరేషన్ అభ్యర్థులకు ఉపయోగపడేలా గెడైన్స్. . . .
Exam Pattern - PAPER - 1 for SGT Posts
I.శిశు వికాసం - పెడగాజి (Marks: 30)
II. లాంగ్వేజ్1 (తెలుగు) (Marks: 30)
*కంటెంట్ (మార్కులు: 24) + మెథడాలజీ (మార్కులు : 6)
III. లాంగ్వేజ్– II(ఇంగ్లిష్) (Marks: 30)
*కంటెంట్ (మార్కులు: 24) + మెథడాలజీ (మార్కులు : 6)
IV. మ్యాథమెటిక్స్ (మార్కులు : 30)
*కంటెంట్ (మార్కులు: 24) + మెథడాలజీ (మార్కులు : 6)
V. పరిసరాల విజ్ఞానం (మార్కులు : 30)
*కంటెంట్ (మార్కులు: 24) + మెథడాలజీ (మార్కులు : 6)
** మొత్తం = 150 మార్కులు
Paper I (for Classes I to V);
No. of Multiple Choice Questions - 150
*టెట్ స్కోర్‌ - డీఎస్సీ వెయిటేజ్ :
డీఎస్సీలో టెట్ స్కోర్‌కు వెయిటేజ్ 20 మార్కులకు ఉంటుంది. టెట్‌లో సాధించే ప్రతి 7 1/2 మార్కులకు 1 మార్కు చొప్పున వెయిటేజీ ఉంటుంది. అందువల్ల డీఎస్సీలో సక్సెస్‌కు టెట్ కీలకం. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్‌ను కేవలం అర్హత పరీక్షగా మాత్రమే భావించకూడదు. ఎందుకంటే అభ్యర్థులు టెట్‌లో సాధించిన ప్రతి 15 మార్కులకు డీఎస్సీలో రెండు మార్కుల వెయిటేజ్ ఉంటుంది.
PASS CRITERIA OF TS TET- 2016
Community Pass marks ;
i) OC - 60% Marks and above
ii) BC - 50% Marks and above
iii) SC - 40% Marks and above
iv) ST - 40% Marks and above
v) Differently abled (Ph) - 40% Marks and above
టెట్ - సిలబస్:
i. శిశు వికాసం - పెడగాజి : అభ్యర్థులు ప్రధానంగా శిశువు ప్రవర్తనకు సంబంధించిన అంశాలపై ఎక్కువ దృష్టిసారించాలి. వికాస దశలు, వికాస అంశాలైన శారీరక, మానసిక, సాంఘిక, ఉద్వేగ వికాసాలు, వైయక్తిక భేదాలు, వాటిలో కనిపించే నిర్దిష్ట అంశాలైన ప్రజ్ఞ, సహజ సామర్థ్యం, మూర్తిమత్వం అంశాలను చదవాలి. శిశువు ప్రవర్తనలో మార్పునకు సంబంధించిన అభ్యాసం, అభ్యసన బదలాయింపు అంశాలను చదవాలి. మనో వైజ్ఞానిక శాస్త్రం (సైకాలజీ) అంశాలను చదివేటప్పుడు కీలక భావనలు, సాంకేతిక పదాలు, సిద్ధాంతాలు-సూత్రాలు, ప్రతిపాదించిన శాస్త్రవేత్తలు, వారి గ్రంథాలు తదితర విషయాలను విశ్లేషణాత్మకంగా చదవాలి. పెడగాజి అంటే బోధన శాస్త్రం. ఇందులో సహిత విద్య, శిశువు విద్యా ప్రణాళిక, బోధన పద్ధతులు, మూల్యాంకనం- నాయకత్వం -మార్గనిర్దేశకత్వం- మంత్రణం (కౌన్సెలింగ్) గురించి అధ్యయనం చేయాలి.
ii. లాంగ్వేజ్1(తెలుగు) : లాంగ్వేజ్ 1& 2లో భాషావిభాగాలకు సంబంధించిన సాధారణ వ్యాకరణ అంశాలు, బోధనపద్ధతులు గురించి ఉంటుంది. లాంగ్వేజ్1(తెలుగు)లో పాఠశాల స్థాయిలో తెలుగు సబ్జెక్ట్ పుస్తకాలతో పాటు తెలుగు బోధన పద్ధతులను చదవాలి.
iii. లాంగ్వేజ్ 2 (ఇంగ్లిష్) : లాంగ్వేజ్ 2లో ఇంగ్లిష్ సబ్జెక్టుపై ప్రశ్నలు అడుగుతారు. గతంలో నిర్వహించిన టెట్‌లో వ్యాకరణానికి సంబంధించి ప్రతి అంశాన్ని పరీక్షిస్తూ ప్రశ్నలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో పార్ట్స్ ఆఫ్ స్పీచ్; ఆర్టికల్స్, డెరైక్ట్ అండ్ ఇన్‌డెరైక్ట్ స్పీచ్; డిగ్రీస్ ఆఫ్ కంపేరిజన్, వొకాబ్యులరీ ఇలా అన్ని అంశాలపైనా అంశాలపై అవగాహన పెంపొందించుకోవాలి.
iv. మ్యాథమెటిక్స్ కంటెంట్ - మెథడాలజీ : అభ్యర్థులు మ్యాథమెటిక్స్ కంటెంట్ కు 3-8వ తరగతి వరకు Government Text పుస్తకాలను తప్పనిసరిగా చదవాలి. గణితం మెథడాలజీ విషయంలో తెలుగు అకాడెమీ పుస్తకాలు, ఆబ్జెక్టివ్ మెటీరియల్ చదవాలి. మెథడాలజీలో ప్రధానంగా బోధనా పద్ధతులు; టీచర్ లెర్నింగ్ మెటీరియల్ (TLM); బోధన ఉద్దేశాలు, విలువలు, లక్ష్యాలను చదవాలి.
V. పరిసరాల విజ్ఞానం కంటెంట్ - మెథడాలజీ :పేపర్-1 పరిసరాల విజ్ఞానం కంటెంట్ కోసం 3-8వ తరగతి వరకు పుస్తకాలు చదవాలి. భూగోళ శాస్త్రం, పౌరనీతి శాస్త్రం, అర్థ శాస్త్రం చదివేటప్పుడు వాటిని సమకాలీన అంశాలతో సరిపోల్చుతూ, జరుగుతున్న పరిణామాలకు అన్వయిస్తూ అధ్యయనం చేయాలి. గత టెట్‌లో ఈ విభాగంలో ప్రశ్నలు క్లిష్టంగానే ఉన్నాయి.
More information available
lakshyasri.in
Reactions

0 Comments:

Post a comment

Latest Jobs

More

Jobs Info

More
Top