Saturday, 7 May 2016

బాసర ట్రిపుల్ ఐటీ 2016-17 నోటిఫికేషన్

బాసర ట్రిపుల్ ఐటీ 2016-17 నోటిఫికేషన్ విడుదల

����బాసర : రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయ (ఆర్టీయూకేటీ) పరిధిలోని బాసర ట్రిపుల్ ఐటీలో 2016-17 విద్యాసంవత్సర (1000 మంది) ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఆరేళ్ల బీటెక్ సమీకృత కోర్సులో చేరేందుకు అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ప్రతిభగల విద్యార్థులకు ట్రిపుల్‌ఐటీలో చేరి ఉన్నత విద్యనభ్యసించేందుకు ఇదే మంచి సమయం.
��ప్రవేశ అర్హతలు

* అభ్యర్థులు ప్రథమ ప్రయత్నంలో 2016-ఎస్‌ఎస్‌సీ, తత్సామాన పరీక్షలో రెగ్యులర్‌గా ఉత్తీర్నులై ఉండాలి.
* 31-12-2016 నాటికి 18 ఏళ్లు నిండకూడదు. ఎస్సీ, ఎస్టీ అభ్యరులకు 21 ఏళ్లు నిండకూడదు.

��ప్రవేశాల షెడ్యూల్..
* ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పంపేందుకు చివరి తేది : మే 31
* విద్యార్థుల ఎంపిక జాబితా విడుదల తేది : జూన్ 11
* సైనికోద్యోగుల పిల్లలు, వికలాంగులు, ఎస్‌సీసీ, స్పోర్ట్స్ కోటా అభ్యర్థుల ప్రవేశాల కౌన్సెలింగ్ తేది : జూన్ 23
* తొలి విడత ప్రవేశాల కౌన్సెలింగ్ తేది : జూలై 1
* రెండో విడత ప్రవేశాల కౌన్సెలింగ్ తేది : జూలై 6
* పీయూసీ ప్రథమ సంవత్సర విద్యార్థులకు ఓరియెంటేషన్ తరగతుల తేది : జూలై 14
* 2016 బ్యాచ్ తరగతులు ప్రారంభం : జూలై 15

జీపీఏ ఆధారంగా అడ్మిషన్లు ఇలా..
పదో తరగతిలో గ్రేడ్ పాయింట్ ఏవరేజ్ (జీపీఏ) ఆధారంగా మెరిట్ పద్ధతిలో ప్రవేశాలు కల్పిస్తారు. ఒకే జీపీఏ ఉన్న అభ్యర్థులకు సబ్జెక్టు వారీగా పొందిన గ్రేడ్ ఆధారంగా ప్రవేశాలు ఉంటాయి. నాన్ రెసిడెన్షియల్ ప్రభుత్వ పాఠశాలలు, జల్లా పరిషత్ పాఠశాలలు, మున్సిపల్ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు వారి జీపీఏకు 0.4 డిప్రెవేషన్ స్కోర్‌ను అదనంగా కలుపుతారు. దీనిని సాంఘికంగా, ఆర్థికంగా వెనుకబాటుకు గురైన విద్యార్థులకు ఇచ్చే వెయింటేజీగా పేర్కొన్నారు. బాసర ట్రిపుల్‌ఐటీలో 85 శాతం సీట్లను స్థానికంగా, మిగిలిన 15శాతం సీట్లను మెరిట్ కోటాలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విద్యార్థులకు కేటాయించారు. రాష్ట్రపతి ఉత్తర్వులు 371 అర్టికల్ డీ సెక్షన్ 95,2014 మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు.

⚖⚖రిజర్వేషన్లు ఇలా...
* ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 6 శాతం, బీసీ-ఏలకు 7 శాతం, బీసీ-బీకి 10 శాతం, బీసీ-సీకి ఒక శాతం, బీసీ-డీకి 7 శాతం, బీసీ-ఈకి 4 శాతం.
* ప్రత్యేక సీట్ల కింద వికలాంగులకు 3 శాతం, సైనికోద్యోగుల పిల్లలకు 2 శాతం, ఎన్‌సీసీ విద్యార్థులకు ఒక శాతం, స్పోర్ట్స్ కోటా కింద 0.5 శాతం సీట్లను భర్తీ చేస్తారు.
* 33.33 శాతం సీట్లను సమాంతరంగా బాలికలకు కేటాయిస్తారు. 
����ఫీజుల వివరాలు...
* రాష్ట్ర పాఠశాలల్లో చదివిన విద్యార్థులు ఏడాదికి రూ.36 వేల ఫీజు చెల్లించాలి. ట్యూషన్ ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు అర్హులైన వారు చెల్లించాల్సిన అవసరం లేదు.
* రిజిస్ట్రేషన్ ఫీజు కింద ఓసీ, బీసీ అభ్యర్థులు రూ. 1000, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ. 500 చొప్పున చెల్లించాలి. క్యాషన్ (దీనిని తిరిగి ఇస్తారు) డిపాజిట్ కింద ఏ కేటగిరి అభ్యర్థులైనా రూ. 2000 చెల్లించాలి. ఇతర రాష్ర్టాలు, గల్ఫ్‌దేశాల్లో పని చేసే వారి పిల్లలు ఏడాదికి రూ. 1.36 లక్షలు, ఎన్‌ఆర్‌ఎం విద్యార్థులు రూ. 3 లక్షల ట్యూషన్ ఫీజు చెల్లించాలి.

దరఖాస్తు చేసుకోండిలా..

* అభ్యర్థులు తమ దరఖాస్తులను ఈ-సేవా, మీ-సేవా కేంద్రాల ద్వారా ఆర్జీయూకేటీ వెబ్‌సైట్ ఆధారంగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
* ఓసీ, బీసీ అభ్యర్థులు దరఖాస్తు రుసుం రూ. 150, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ. 100 చెల్లించాలి.
* దరఖాస్తు ఫీజుతో పాటు సర్వీసుచార్జి కింద ఆన్‌లైన్ సెంటర్లకు అదనంగా రూ. 20 చెల్లించాలి.

గ్రేడ్ పాయింట్లు సమానమైతే..

ట్రిపుల్ ఐటీ సీటుకోసం దరఖాస్తు చేసుకున్న ఇద్దరి విద్యార్థుల జీపీఏలు ఒక్కటే అయితే వరుసగా గణితం, జనరల్ సైన్స్, ఇంగ్లిషు, సోషల్‌లో ఎక్కువ గ్రేడ్ వచ్చిన వారికి ప్రాధాన్యం ఇస్తారు. ఇవన్నీ సమానంగా ఉంటే ఫస్ట్ లాంగ్వేజ్‌లో ఎక్కువ గ్రేడ్ వచ్చిన వారిని ఎంపిక చేస్తారు. ఇవన్నీ సమానంగా ఉంటే హాల్‌టికెట్ నంబర్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తుతో జత చేయాల్సిన ధ్రువీకరణ పత్రాలు..

ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పించినప్పుడు ఇచ్చిన రసీదు, పదో తరగతి హాల్ టికెట్, మార్కుల లిస్టు, నివాసం, బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు కుల ధ్రువీకరణ పత్రాలు, వికలాంగులైతే వైకల్య నిర్ధారణ పత్రాలు, సైనికోద్యోగుల పిల్లలు సంబంధిత అధికారి జారీ చేసిన ధ్రువీకరణ పత్రం, ఎన్‌సీసీ, స్పోర్ట్స్ కోటా అభ్యర్థులైతే సంబంధిత అధికారి జారీ చేసిన ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలి.
వసతులు..
విద్యార్థులకు వసతి, భోజన సౌకర్యాలతో పాటు, రెండు జతల యూనిఫాం, షూలు, ల్యాప్‌టాప్‌లు, ఇతర సౌకర్యాలు ఉచితంగా కల్పిస్తార

Reactions

0 Comments:

Post a comment

Latest Jobs

More

Jobs Info

More
Top