Wednesday, 27 July 2016

రండి ఓ అన్నల్లార అక్కల్లార......రండి మా అందమైన చిత్ర విచిత్రాలను చూడగా

 రండి  ఓ  అన్నల్లార  అక్కల్లార......రండి
    మా  అందమైన  చిత్ర  విచిత్రాలను  చూడగా   ||రండి||
 
   అమ్మ నాన్నల   ఆత్మీయ ఆశయాలను   సాధింపగా
   మా గురువులు  చెప్పిన  చదువుల   సారం
   మా మదిలో తోచిన  ఊహల  ఊపిరియె...
   ఈ మర ఇందన  చిత్రాలను చూడగా                ||రండి||
 
   మా  చిట్టి  చేతులలోని   చిత్రాలను  చూడగా
   భరతమాత   నవ పునాది  చిత్రాలను చూడగా
   నవ భారత  శాస్ర్తవేత్తల  అద్భుత సృష్టిని
   అవనిలో  అమ్మ  భరతమాత  ఖ్యాతిని  నిలుపగా
   నిలిచే  మరచిత్రాలను  చూడగా                       ||రండి||

   పర్యావరణ  పరిరక్షణలు  సూచనలు
   ఇందన  పొదుపు  పద్దతులను
   సస్యశ్యామల  దేశ  అభివృద్దికి  మార్గ  నిర్దేశాలెన్నో
   మా చిట్టి  చిట్టి  బుర్రల  మంత్ర  తంత్రులను  చూడగా  ||రండి||

Reactions

0 Comments:

Post a comment

Latest Jobs

More

Jobs Info

More
Top