Thursday, 10 August 2017

దేశ భక్తి గీతాలు@4

దేశ భక్తి గీతాలు@4

జయము జయము భరతమాత 
 

ఈ జగాన సాటి యెవ్వరే ఓయమ్మ నీకు       || జయము ||

గంగ యమున గోదారీ సింధు కృష్ణ కావేరీ
బ్రహ్మపుత్ర తుంగభద్ర తపతీ నర్మద పెన్నా
పొంగి పొరలె తరంగాలు నీ మెడలో హారాలు
జీవనదుల గన్నతల్లివే ఓయమ్మ నీవు   || జయము ||

హిమ వింధ్యా పర్వతాలు దేవతలకు నిలయాలు
దట్టమైన అరణ్యాలు మహామునుల స్థావరాలు
పసిడి పంట క్షేత్రాలు పంచలోహ ఖనిజాలు
నిజముగ నువు రత్గర్భవే ఓయమ్మ నీవు   || జయము ||

లోకమంత చీకటిలో తల్లడిల్లుతున్నప్పుడు
నాగరికత లేక నరులు పామరులై ఉన్నప్పుడు
వేదాలను వెలికితెచ్చి జ్ఞాన భిక్ష పెట్టినావు
నిజముగ నువు జగద్గురువువే ఓయమ్మ నీవు  || జయము ||
 తేనెల తేటల మాటలతో మన దేశ మాతనే

 తేనెల తేటల మాటలతో మన దేశ మాతనే కొలిచెదమా
భావం భాగ్యం కూర్చుకొని ఇక జీవన యానం చేయుదమా

సాగర మేఖల చుత్తుకొని సుర గంగ చీరగా మలచుకొని
గీతా గానం పాడుకొని మన దేవి కి ఇవ్వాలి హారతులు

గాంగ జటాధర భావనతో హిమ శైల శిఖరమే నిలబడగా
గలగల పారే నదులన్నీ ఒక బృంద గానమే చేస్తుంటే

ఎందరు వీరుల త్యాగబలం మన నేటి స్వేచ్చకే మూలబలం
వారందరిని తలచుకొని మన మానస వీధిని నిలుపుకొని
నిర్మల సుర గంగాజల సంగమ క్షేత్రం

నిర్మల సుర గంగాజల సంగమ క్షేత్రం 
రంగుల హరివిల్లులు విలసిల్లిన నిలయం
భారతదేశం మన జన్మ ప్రదేశం
భారత ఖండం ఒక అమృత భాండం

ఉత్తరాన ఉన్నతమౌ హిమగిరి శిఖరం
దక్షిణాన నెలకొన్నది హిందు సముద్రం
తూరుపు దిశ పొంగి పొరలె గంగా సంద్రం
పశ్చిమాన అనంతమై సింధు సముద్రం  || భారతదేశం ||

ఒకే జాతి సంస్కృతి ఒకటున్న ప్రదేశం
రత్నగర్భ పేరు గన్న భారత దేశం
ధీర పుణ్య చరితలున్న ఆలయ శిఖరం
సత్య ధర్మ శాంతులున్న ప్రేమ కుటీరం  || భారతదేశం ||

కోకిలమ్మ పాడగలదు జాతీయ గీతం
కొండకోన వాగు పాడు సంస్కృతి గీతం
గుండె గుండె కలుసుకుంటే సమరస భావం
చేయి చేయి కలిపితేనే ప్రగతుల తీరం  || భారతదేశం ||


 జయ భారతా వాణీ సకల కళా రాణీ 

 జయ భారతా వాణీ సకల కళా రాణీ
సంగీత వాహినీ స్వర హార ధారిణీ
అభివందనం అభివందనం

హిందువు కావేరీ హిమగిరి మకుట ధారిణీ
నవమార్గ దర్శినీ సత్యామృత వర్షిణీ
యుగయుగాల చరిత గన్న ఆనంద దాయినీ

సమతా సుహృద్భావం వెల్లివిరియు ప్రతి ఎదలో
నీ మమతా మానవతలె నిలిచిపోనీ మా మదిలో
నీ సేవయె మాకు మిన్న నవజీవన సంధాయినీ 35.సత్యం శివం సుందరం

సాధమరి సంస్కార భారతి భారతే నవజీవనం
ప్రణవ మూలం ప్రగతి శీలం
ప్రణవ మూలం ప్రగతి శీలం ప్రఖరరాష్ట్రు వివర్థకం
శివం సత్యం సుందరం
అభినవం సంస్కరణోధ్యమం
మధుర మంజుల రాగభరితం
హృదయ తంత్రీ మంత్రితం
వాదయతి సంగీతకం
వసుదైక భావన పోషకం
లలిత రసమయ లాస్యలీల
చండ తాందవ గమక హేల
కలిత జీవిన నాట్యవేదం
కాంతి క్రాంతి కధా ప్రమోదం
చతుష్షష్టి కళాన్వితం
పరమేష్టినా పరవర్తితం
విశ్వ చక్రభమణ రూపం
శాశ్వతం శృతి సమ్మతం
జూవయత్యభి లేఖ మఖిలం
సప్తవర్ణ సమీకృతం
ప్లావయతి రససింధునా
ప్రతి హిందు మానస నందనం
 
 ఒకటే దేశం మనది నిజం నిజం

 ఒకటే దేశం మనది నిజం నిజం
ఒక్కటే జాతి మనది అదే నిజం అదే నిజం
వర్ణములేవైనా మరి కులములెన్ని ఉన్నా
వనంలోని చెట్లు మనం వసుదైవ  కుటుంబకం    
                                      || ఒకటే దేశం ||

భరతుడు పరిపాలించిన భారతదేశం మనది
తరతరాల వారసత్వ సంపద మనకున్నది
చేయి చాచి యాచించే అవసరమేమున్నది
అంతకన్న హీనమైన బ్రతుకింకేమున్నది
                                      || ఒకటే దేశం ||

వాల్మీకి మనవాడే వ్రాసెను రామాయణం
వ్యాసుండెవరో కాదు వ్రాసె మహాభారతం
అష్టాదశ పురాణాలు అంతులేని గ్రంథాలు
అందించిన ఋషులందరు వందనీయులే మనకు
                                      || ఒకటే దేశం ||

గుండెలలో భగవంతుని బంధించిన భక్తులు
ప్రకృతినే శాసించిన పతివ్రతా మూర్తులు
సత్యాన్వేషణకై తమ సర్వస్వాన్నర్పించిన
త్యాగులు యోగులు భళిరే వీతరాగులెందరో
                                      || ఒకటే దేశం ||


.జన జాగృత నవ భారత మహోదయం 

ఈ కనులతోనే కాంచుదాము
ఈ జీవితమున సాధించుదాం || జన ||

ప్రతి హృదిలో దేశభక్తి మోసులెత్త
నరనరాన నవచేతన వెల్లివిరియ
సమతాభావన పెంచి ప్రతి హృదిలో మమత నింపి
జాతిని సేవించుదాం మన భారతినే పూజించుదాం  || జన ||

మన పూర్వుల మహనీయుల స్మరియించి
మన సంస్కృతీ మహోన్నతిని గుర్తెరిగి
అహరహము శ్రమియించి జగతిన శిరమెత్తి నిలిచి
జాతిని సేవించుదాం మన భారతినే పూజించుదాం || జన ||

ప్రాంత భాష కులమతాల కలతలతో
పలురీతుల బలహీనత లావరించే
అందరమొకటిగా నిలచి తరతమ భేదాలు మరచి
జాతిని సేవించుదాం మన భారతినే పూజించుదాం || జన ||

నలుదిక్కుల ప్రమాదాలు పెచ్చు పెరిగి
అదనుచూచి కాటువేయ చూస్తున్నవి
జనతను జాగృత పరచి ఎదఎదలో శక్తి నింపి
జాతిని సేవించుదాం మన భారతినే పూజించుదాం || జన || భారతి నా కన్నతల్లి భాగ్యోదయ కల్పవల్లి

 భారతి నా కన్నతల్లి భాగ్యోదయ కల్పవల్లి
విశ్వ శాంతి విరియించిన చిరుపువ్వుల శిరసు మల్లి          || భారతి ||

వార్ధిత్రయ భవ్య వసన వింధ్యాచల విశద రచన
కాశ్మీరపు రశ్మి వదన నిర్మల గుణ నిఖిల సదన             || భారతి ||

సన్నుత హిమశిఖరము వలె ఉన్నత మస్తక శోభిని
పావన గంగా నది వలె జీవన గీతాదాయిని                    || భారతి ||

భారతి బంగరు ముంగిట భగవంతుడె పారాడెను
ఋషి సంతతి గొంతు విప్పి ఋక్కులు చక్కగ పాడెను     || భారతి ||

క్షమతా కేతనమెత్తెను సమతా శంఖమునొత్తెను
వితరణ గుణ గౌరవమున విశ్వమునే ముంచెత్తెను          || భారతి ||.మన జాతీయ జెండా

మూడు రంగుల జెండా
ముచ్చటైన జెండా
భారతీయుల జెండా
బహు గొప్ప జెండా
అందరూ మెచ్చిన జెండా
ఆకాశంలో ఎగిరే జెండా
అంధకారం పోగిట్టిన జెండా
ఆశలు మనలో రేపిన జెండా

గాంధీతాత మెచ్చిన జెండా
నెహ్రుగారికి నచ్చిన జెండా
భగత్‌సింగ్ పట్టిన జెండా
బోసు నేత ఎగరేసిన జెండా
తెల్లదొరలను ఎదిరించిన జెండా
చల్లగ స్వరాజ్యం తెచ్చిన జెండా

అందరి మదిలో నిండిన జెండా 
పింగళి వెంకయ్య ఊహల జెండా
శాంతి సహనం చూపిన జెండా
అందరి నొక్కటిగా నడిపిన జెండా
మంచి మమతలు చూపిన జెండా
ఇదే నండి మన జాతీయ జెండా 
ఈ జెండ పసిబోసి చిరునవ్వురా


ఈ జెండ పసిబోసి చిరునవ్వురా దాశ్య సంకెళ్ళు తెంచిందిరా
ఈ జెండ అమరుల తుదిశ్వాసరా రక్త తిలకాలు దిద్దిందిరా
వీర స్వతంత్ర పోరాట తొలి పిలుపురా
మనవెలలేని త్యాగాల ఘనచరితరా
తన తగుబాలతో పోరు నెర్పిందిరా
ఉరికొయ్యల్ని ఉయ్యాల చేసిందిరా
ఆ తెల్లోడి గుండెల్ని తొలిచేసినా అమ్మురా
వందేమాతరం మనదే ఈ తరం
వందేమాతరం పలికే ప్రతి నరం

చరణం 1

శాస్త్రానికి జ్ఞానానికి ఆది గురువురా మనదేశం
మానవాళికే వైతాళిక గీతం రా.. భారతం
ధర్మానికి సత్యానికి జన్మ భూమిరా మనదేశం
ఎన్నో మతాల సహజీవన సూత్రం రా.. భారతం
ఆ దైవం మనకోసం సృష్టించే ఈ స్వర్గం
శికాలలు పోసింది ఆ తల్లిరా తన దేహాన్ని తీరాన్ని పంచిందిరా
మనమేమిస్తే తీరేను ఆ రుణమురా
ఇక మనకేమి ఇచ్చిందనడగొద్దురా
భారతీయులుగ పుట్టాము ఈ జన్మకిది చాలురా...
వందేమాతరం మనదే ఈ తరం
వందేమాతరం పలికే ప్రతి నరం

చరణం 2

పిచ్చి కుక్కల ఉగ్రవాదమే రెచ్చిపోయిక కాటేసినా
వెన్ను చూపని ఉక్కు సైన్యానికే.. సలామురా
మంచు మల్లెల శాంతికపోతం నెత్తుటి తడిలో తడిసినా
చెక్కు చెదరని ఐకమత్యమే ఒక్కటే.. సవాలురా
మానవుడే మావేదం మానవతే సందేశం
మా శతకోటి హృదయాలదొకమాటరా
నువ్వు పిడికిలితో అణిచేను నీ బలుపురా
చావుకెదురైన భయపడదు మా గుండెరా
శతృవుడెవడైన తలవంచని ఈ జెండారా
ఫిరంగుల్ని ఎదిరించి తొడగొట్టి నిలిచిందిరా
వందేమాతరం మనదే ఈ తరం
వందేమాతరం పలికే ప్రతి నరం
Reactions

0 Comments:

Post a comment

Latest Jobs

More

Jobs Info

More
Top