Thursday, 10 August 2017

దేశ భక్తి గీతాలు@6

దేశ భక్తి గీతాలు@6 .పాడవోయి భారతీయుడా
పల్లవి

పాడవోయి భారతీయుడా
ఆడి - పాడవోయి విజయగీతిక
నేడే స్వాతంత్ర్యదినం - వీరుల త్యాగఫలం
నేడే నవోదయం - నీదే ఆనందం ||పాడ||

చరణం 1

స్వాతంత్ర్యం వచ్చెననీ సభలే చేసి
సంబరపడగానే సరిపోదోయి
సాధించినదానికి సంతృప్తిని చెంది..
అదే విజయమనుకుంటే పొరబాటోయి
ఆగకోయి భారతీయుడా
కదలి సాగవోయి ప్రగతిదారులా ||ఆగ||

చరణం 2

ఆకాశం అందుకునే ధరలొకవైపు
అదుపులేని నిరుద్యోగం మింకొకవైపు
అవినీతి బంధు ప్రీతి చీకటిబజారు
అలుముకొన్న నీదేశం ఎటు దిగజారు
కాంచవోయి నేటి దుస్థితి
ఎదిరించవోయి ఈ పరిస్థితి ||కాం||  

52. చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా 

చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా
గతమెంతో ఘన కీర్తి గలవోడా

వీర రక్తపు ధార వార వోసిన సీమ
పలనాడు నీదెరా వెలనాడు నీదెరా
బాల చంద్రుడు చూడ ఎవరోడోయ్
తాండ్ర పాపయ కూడ నీవోడోయ్ ||చెయ్యెత్తి ||

నాయకీ నాగమ్మ, మంగమాంబ, మొల్ల
మగువ మాంచాల నీ తోడ బుట్టిన వోళ్ళె
వీర వనితల గన్న తల్లేరా
ధీర మాతల జన్మ భూమేరా ||చెయ్యెత్తి ||

కల్లోల గౌతమి వెల్లువల క్రిష్ణమ్మ
తుంగభద్రా తల్లి పొంగిపొరలిన చాలు
ధాన్య రాశులు పండు దేశాన
కూడు గుడ్డకు కొదువ లేదోయి ||చెయ్యెత్తి ||

పెనుగాలి వీచింది అణగారి పోయింది
నట్టనడి సంద్రాన నావ నిలుచుండాది
ముక్కోటి బలగమై ఒక్కటై మనముంటే
ఇరుగు పొరుగూలోన ఊరు పేరుంటాది
తల్లి ఒక్కటె నీకు తెలుగోడా
సవతి బిడ్డల పోరు మనకేలా? ||చెయ్యెత్తి ||


53. పాడనా తెలుగుపాట

పాడనా తెలుగుపాట! పరవశనై - మీ ఎదుట - మీ పాట
పాడనా తెలుగు పాట

కోవెల గంటల గణ గణలో - గోదావరి తరగల గల గలలో
మావుల పూవుల మోపులపైనా - మసలే గాలుల గుసగుసలో
మంచి ముత్యాల పేట - మధురామృతాల తేట - ఒక పాట పాడనా

త్యాగయ క్షేత్రయ రామదాసులు - తనివితీర వినిపించినది
నాడు నాడులా కదిలించెది - వాడ వాడలా కనిపించెది
చక్కెర మాటల మూట - చిక్కని తేనెల వూట - ఒక పాట పాడనా

వళ్ళంత వయ్యారి కోక - కళ్ళకు కాటుక రేఖ
మెళ్ళో తాళి - కాళ్ళకు పారాణి - మెరిసే కుంకుమ బొట్టు
ఘల్లు ఘల్లున కడియాలందెలు - అల్లనల్లన నడయాడె
తెలుగుతల్లి పెట్టని కొట - తెనుగును నాటె ప్రతిచోట - ఒక పాట పాడనా
 

54. దినదినము వర్దిల్లు తెలుగు దేశం

దినదినము వర్దిల్లు తెలుగు దేశం...
దీప్తులను వెదజల్లు తెలుగు తేజం...

తేనె కన్నా తీయనిదీ, తెలుగు భాష!
దేశ భాషలందు లెస్స, తెలుగు భాష!

మయూరాల వయారాలు మాటలలో పురివిప్పును
పావురాల కువకువలు పలుకులందు నినదించును
సప్తస్వరనాదసుధలు, నవరసభావాలమనులు
చారు తెలుగు సొగసులోన జాలువారు జాతీయం

తేనె కన్నా తీయనిదీ, తెలుగు భాష!
దేశ భాషలందు లెస్స, తెలుగు భాష!

అమరావతి సీమలో కమనీయ శిలామంజరి
రామప్ప గుడి గోడల రమనీయ కళారంజని
అన్నమయ్య సంకీర్తనం, క్షేత్రయ్య శృంగారం
త్యాగరాజు రాగమధువు తెలుగు సామగానమయం

తేనె కన్నా తీయనిదీ, తెలుగు భాష!
దేశ భాషలందు లెస్స, తెలుగు భాష!


55.తెలుగు జాతి మనది 

తెలుగు జాతి మనది …. నిండుగ వెలుగు జాతి మనది
తెలుగు జాతి మనది …. నిండుగ వెలుగు జాతి మనది
తెలంగాణ నాది … రాయలసీమ నాది … సర్కారు నాది … నెల్లూరు నాది ..
అన్నీ కలిసిన తెలుగునాడు … మనదే … మనదే … మనదేరా..
తెలుగు జాతి మనది …. నిండుగ వెలుగు జాతి మనది

ప్రాంతాలు వేరైనా మన అంతరంగమొకటేనన్నా
యాసలు వేరుగ ఉన్నా ..మన భాష తెలుగు భాషన్నా
వచ్చిండన్నా …. వచ్చాడన్నా … ఆ …..
వచ్చిండన్నా …. వచ్చాడన్నా పరాల తెలుగు ఒకటేనన్నా …
తెలుగు జాతి మనది …. నిండుగ వెలుగు జాతి మనది

మహాభారతం పుట్టింది రాణ్మహేంద్రవరంలో
భాగవతం పుట్టింది ఏకశిలానగరంలో
ఈ రెంటిలోన ఏది కాదన్న
ఈ రెంటిలోన ఏది కాదన్న ఇన్నాళ్ళ సంస్కృతి నిండుసున్నా
తెలుగు జాతి మనది …. నిండుగ వెలుగు జాతి మనది

పోచంపాడు ఎవరిది …నాగార్జున సాగరమెవరిది
పోచంపాడు ఎవరిది …నాగార్జున సాగరమెవరిది
మూడు కొండలు కలిపి దున్నినా ముక్కారు పంటలుబండ్లకెత్తినా
అన్నపూర్ణమ్మ కన్నబిడ్డలం . ఐదు కోట్ల తెలుగువారిది
తెలుగు జాతి మనది …. నిండుగ వెలుగు జాతి మనది

సిపాయి కలహం విజృంభించ నరసింహాలై గర్జంచాము
స్వతంత్ర భారత్ కి జై
గాంధీ, నెహ్రూల పిలుపునందుకుని సత్యాగ్రహాలు చేసాము
వందేమాతరం .. వందేమాతరం
స్వరాజ్య సిద్ధి జరిగిన పిమ్మట స్వరాష్ట్రమును సాధించాము
జై విశాలాంధ్ర
దేశభక్తిలో తెలుగువారికి దీటే లేదనిపించాము
తెలుగు జాతి మనది …. నిండుగ వెలుగు జాతి మనది

ఇంటిలోన అరమరికలు ఉంటే ఇల్లెక్కి చాటాలా
కంటిలో నలక తీయాలంటే కనుగుడ్డు పెరికి వేయాలా
పాలుపొంగు మన తెలుగుగడ్డను పగులగొట్టవద్దు
పాలుపొంగు మన తెలుగుగడ్డను పగులగొట్టవద్దు
నలుగురిలో మనజాతిపేరును నవ్వులపాలు చెయ్యెద్దు

తెలుగు జాతి మనది …. నిండుగ వెలుగు జాతి మనది
తెలంగాణ మనది … రాయలసీమ మనది … సర్కారు మనది … నెల్లూరు మనది ..
అన్నీ కలిసిన తెలుగునాడు … మనదే … మనదే … మనదేరా..
తెలుగు జాతి మనది …. నిండుగ వెలుగు జాతి మనది

56.తెలుగు యువకుల్లారా!

ఇది వైకుంఠము, వేంకటేశ్వరుడు ల
క్ష్మీ శుండు కొల్వుండుటన్:
ఇది కైలాసము, మల్లికార్జునుడి ఆ
ర్యే శుండు చెల్వొందుటన్:
ఇది బ్రహ్మొర్పి, సరసవతీ చరణ పం
కే జాతిమై యొప్పుటన్:
ఇది మా ఆంధ్రము నీకు పీఠము త్రిశ
క్తీ; పూజ గై కోగదే;
వాణియు తీర వాటిక, భ
వానియె రాయలసీమ, శ్రీ తెలం
గాణము పూర్ణ రాజ్యరమ
గా ముగురమ్మల మూర్తిదాల్చి గీ
ర్వాణ పధమ్ములనే గదలి
వచ్చితినే; జగమేలు కొమ్మకన్
రాజ దలిర్ప, మాగపతి
రంజిల, ఆంధమ; భాగ్యసాంద్రమా!

దేశము జుట్ట బెట్టి తల
దిండుగ బెట్టుక నిద్రపోవు ఆ
వేశము తెల్గువానిది; ప్ర
వేశము తక్కువ కార్య నైపుణిన్;

ఏ శిఖరాల వెంబడి గ
మించునో, ఏ శశిపై శ్రమించునో
పరమ కవిత్వ మందు ప్రతి
వారును బమ్మిర పోతరాజె; సుం

దర తమ గాన మందు ప్రతి
తమ్ముడు తానొక త్యాగరాజె; న
త్వర పరదన మందు, ప్రతి
త్వర పరదన మందు, ప్రతి

డరయ సవాంధ్ర మందు ప్రజ
లందరు రాజులె రాజ తేజులే
కలసి ఉంటే గెలుపు కొస్తాం
చీలిపోతే కూలిపోతాం

భీముడూ గొప్పవాడే
అర్జునుడూ గొప్పవాడే
ధర్మరాజు కూడ గొప్పవాడే
కలిసి ఉన్నపుడు

సుందోవ సుందులు కాకండర్రా!
ఓ తెలుగు యువకుల్లారా!
మిమ్మల్ని భ్రమింప జేస్తున్న రంభ
వట్టి వయాముఖ విషకుంభ!

 57.ధర్మశాస్త్రాలు
ఇదేనా మా దేశం - ఇదేనా భారతదేశం
గనిలో పనిలో కార్ఖానాలో
పాటుపడే దౌర్భాగ్య జీవులను
తిండి బట్ట యేర్పరున బూనిన
పండిత జవహారు ప్రభవించినది
ధనవంతుల మేడల నీడలతో
నిరుపేదల జీవిత యాతనలు
కానరాని గతి కన్ను మూసి
లోకాన ధర్మశాస్త్రాలు చాటునది

58.దేశభాషలందు తెలుగు లెస్స

ఉగ్గుపాల నుండి ఉయ్యాలలో నుండి
అమ్మపాట పాడినట్టి భాష
తేనె వంటి మందు వీనులకును విందు
దేశభాషలందు తెలుగులెస్స!
సంస్కృతంబులోని చక్కెర పాకంబు
అరవభాషలోని అమృతరాశి
కన్నడంబులోని కస్తూరి వాసన
కలిసిపోయే తేట తెలుగు నందు
వేలవేల కవుల వెలుగులో రూపొంది
దేశదేశములను వాసిగాంచి
వేయియేండ్ల నుండి విలసిల్లు నా భాషా
దేశభాషలందు తెలుగు లెస్స!


59.నన్నుగన్న తల్లి

నన్నుగన్న తల్లి! నా భాగ్యమా!
నారాయణి! ధర్మాంబికే
నన్నుగన్న తల్లి! నా భాగ్యమా!
నారాయణి! ధర్మాంబికే
కనకాంగి! రామావతి సోదరి!
కాదనీ నను, కాత్యాయని!
నన్నుగన్న తల్లి! నా భాగ్యమా!
నారాయణి! ధర్మాంబికే
కావుకావుమని నీ మొఱబెట్టగా
కనులలోచన! కరుగుచుండగా,
నీవు బ్రోవకున్న నెవరు బ్రోతురు? స
దా వరంబొసగు త్యాగరాజనుతి
నన్నుగన్న తల్లి! నా భాగ్యమా!
నారాయణి! ధర్మాంబికే! 

 60.త్రిలింగ దేశం

త్రిలింగ దేశం మనదేనోయ్,
తెలుంగులంటే మనమేనోయ్
మధురం మధురం మధురం మధురం
ఆంధ్రమ్మంటే అతిమధురం
దేశభాషలా తీరుల్లోకీ, ఆంధ్రమ్మంటే అతిమధురం
రాయలు మనవాడోయ్
పండితరాయలు, మనవాడోయ్
కలం తిక్కనా, ఖడ్గ తిక్కనా,
గణపతిదేవులు మనవారోయ్!!
అమరావతి నాగార్జున కొండా,
సిద్ధహస్తులా శిల్పాలోయ్
మల్లినాధ కుమారిభట్టులు,
అందెవేసినా హస్తాలోయ్!!
గోదావరి కృష్ణా, తుంగభద్రా పెన్నా
కనిపెంచినవోయ్ తెలుగుజాతిని,
వినిపించనవోయ్ వీణానాదం!!
ఓడలు కట్టామూ
మిటికి, మేడలు కట్టామూ
మున్నీరంతా ఏకరాశిగా
ముద్దరవేశామూ!!
సంతలలో వజ్రాల రాసులూ,
జలజలలాడినవీ
కుబేరతుల్యం మహదైశ్వర్యం
గొడుగుపట్టినాదీ!!
కలకలలాడే తెలుగుదేవికి,
గంధాగరుధూపం,
కిలకిలలాడే తెలుంగు కన్నెల
కిన్నెరలాలాపం
బలం గడించీ - వెలుంగునింపే,
తెలుంగుజండా "హు"
తెలుంగు భేరీ "ఢాం"
గణగణ గణగణ గణగణ గణగణ,
తెలుంగు జయఘంటా!
గణగణా గణాగణ, గణాగణా గణ,
తెలుంగు జయఘంటా... త్రి||
Reactions

0 Comments:

Post a comment

Latest Jobs

More

Jobs Info

More
Top