Thursday, 10 August 2017

దేశ భక్తి గీతాలు@7

దేశ భక్తి గీతాలు@7 ఆంధ్రమాత పుత్రులారా

మిత్రులార
ఆంధ్ర మాత పుత్రులార
మంజుళ మధు పాత్రలార!

నలుబది ఆరేండ్లకు ముందర
హృదయాలను కలిపేసిన
మననేకం చేసేసిన
మధుర మంగళోషస్సును
మనకు జ్ఞాపకం చేసే
ఈ హేమంత తమస్సులో
విభేదాల దుమ్ముదులిపి
వివరాల మడతలు విపొపేసి
విషాదాల చలి తొలగించి
కవిత్వాల రగ్గు కప్పి
ఉత్సవాల హుక్కుతో
మత్తెక్కిన మనసుతో
కైపెక్కిన కనులతో
మనసు మనం తెలుసుకునే
మాట మరచిపోరాదు
భగవంతుని తలపించీ
వరమాత్తమమైన మతం
యమునింటికి పంపించీ
అతి హీన మతమైంది
ప్రజాక్షేమమును నోరే
రాజకీయ రాజీవం
ప్రజాక్షామ కారకమై
నేశైనది నిర్జీనం
గుండెను రెండుగ చీల్చే
మొండితనం పనికిరాదు
మనసులనేకం చేసే
మంచితనం కావాలి
అభాగ్యుల్ని కాము మనం
భాగ్యనగరి మనది
అపజయం లేదు మనకు
విజయవాడ మనది
హిమశైలం మనది
హిందూ మహాసముద్ర జలం మనది
హరశూలం మనది హరిచక్రం మనది
హరి హరులను మించినట్టి
నర హృదయం ఈనాడు
వానర హృదయ మయింది
మన్ ఏక్ మందిర్ నహీ
మన్ ఏక్ బందర్ హై
నరుడు అలనాడు వానరుడు
ఈనాడు నిశాచరుడు
ప్రశాంత మానవ జగతిని
అశాంతి రేకెత్తించే
నిశాచరుడు మనకు వద్దు
నరుడు కావాలి నిండైన నిశాకరుడు
గుండెలలో అనురాగపు పండు వెన్నెలలు
పండించే నిండైన నిశాచరుడు
నేక్కడో దూర దూరాల వున్నాను
కాని మీ హృదయాల తీరతీరాల వున్నాను
మీ గుండెల పూడండల దార దారాన వున్నాను
రవీంద్ర భారతిలో
కవీంద్రుల కవిత్వపు హారతిలో వున్నాను
తెగిన గాలిపటం కాదు
తెలంగాణ
తెలంగాణ తేనెసోన
తెలంగాణ దివ్యవీణ
తెలంగాణ మహారాణా
తెలంగాణ నవకవితల నజరానా
తెలుగు జాతి ఒక్కటి
భరత జాతి ఒక్కటి
ప్రపంచమే ఒక్కటి
శశి బింబం ఒక్కటి
రవి బింబం ఒక్కటి
రేపు నవంబరు ఒక్కటి
యెప్పుడూ మనమంతా ఒక్కటి

 62.ఆనందాల కల్పవల్లి

అదేనో తెలుగు తల్లి
అందాల నిండు జాబిల్లి
ఆనందాల కల్పవల్లి
అదే నీ తెలుగు తల్లి
పదవోయ్ తెలుగువాడా
అదే నీ తెలుగు మేడ
సంకెళ్ళు లేని నేల
సంతోష చంద్రశాల
కనవోయ్ తెనుంగు రేడా
అదే నీ అనుంగు నేల
అదిగో సుదూరనేల
చనవోయ్ తెలుగు వీరా
స్వర్ణాల కాంతి స్వప్నాలు
స్వప్నాల శాంతి స్వర్గాలు
నిన్నే పిలుస్తున్నాయి
నిన్నే వరిస్తున్నాయి
ఆందోళనాల డోల
సందేహాల హిందోళ
ఎందాక ఊగిసలాట
ఇదే నీ గులాబీ తోట

 63.ఇదే ఆంధ్రదేశం

ఇదే ఇదే నా దేశం - ఇదే ఆంధ్రదేశం
తరతరాల చరిత్రలో తడిసిన సందేశం
శాతవాహనుల నాటి శౌర్యము ఊపిరిగా
కాకతీయ రాజుల సంగ్రామ దీక్ష సిరిగా
త్యాగరాజు గానసుధ ధారలు సంపదగా
పోతరాజు భాగవతపు గాధలు నా ఎదగా
హంసి అమరావతి నాకమరినని శ్రీకళలై
గోదానది కృష్ణవేణి కూరిమి నిచ్చెలులై
కూచిపూడి నాట్యము నా గొప్పను పెన్నిధిగా
విలసిల్లిన వికసించిన సంస్కృతి సన్నిధిగా
అంధత్వం అన్ని దిశల ఆలోచన రేపగా
తెలుగుల అభిమాన ధనం దిక్కుల వ్యాపించగా
ఇది కోస్తా తెలంగాణా ఇది రాయలసీమగా
ఏడు కోట్ల గొంతులచే రాగము వినిపించగా 

 64. ఇల్లలుకుతూ అలుకుతూ

ఆంధ్రప్రదేశ్ అవతరణోత్సవ దినాన
అబద్దం ఆడతానికి నోరు రాక
అంత క్షేమంగా వున్నామని చెప్పలేక
అటూ ఇటూ వూగిసలాడూతూ
అల్లుకు వచ్చిన గీతం వినండి
నిజానికి కాలం మన మీద యింకా
కారాలు మిరియాలు నూరుతూనే ఉంది
కఠినంగా కరిచింది కాలం మనల్ని
అందరి మనసుల్ని అడ్డంగా విరిచింది
ఐక్యతా లత అల్లుకున్న అందాల పూల పందిరి మీద
అంగుళానికి అరడజను వంతున
గొంగళి పురుగులు ప్రాకుతున్నాయి
వాటి పీద్డ పడలేక తోటంతా
పీకేద్దామంటున్నారు కొందరు!
చుక్కల లోకం లోకి ఎక్కాలని
వేసిన నిచ్చెన్లు విరగొట్టారు కొందరు
కూచున్న కుర్చీ కుషన్లలో
గుండు సూదులు గ్రుచ్చి వెళ్ళారు కొందరు
వానదేవుణ్ణి రమ్మని టెలిగ్రాం పంపితే
వరద దేవుడొచ్చి కూర్చున్నాడు
పైర గాలిని రమ్మని కబురు చేస్తే
తుఫాను గాలులు తొంగి చూశాయి
కూలిపోయిన నిరుపేదల గుడిశెలు
కాలిపోయిన గ్రామీణుల జీవితాలు
హృదయం దహించుకు పోయే
విషాద సంఘటనలు ఒక వైపు
కొండ అడ్డు తగిలి రెండుగా చీలుతానంటున్న ప్రవాహం
కక్షలు కార్పణ్యాలు ప్రాంతీయ తత్వాల ప్రభావం
మనసులు చెదిరి మనుషులందరూ చెదిరి
తోలగి దూరంగా పోతున్న దృశ్యాలు ఒక వైపు
ఏం చెప్పను నాదేశపు శోభ
మనసులు మారడం లేదు
మాకేమిటి లాభమనీ
మాట మారడం లేదు ఆంధ్రులెవరో అరవలెవరో అసలే తెలీదు నాకు
తెలుగు వారికి యీ మధ్య పుట్టిన తెగులేమితో తెలీదు నాకు
అనైక్యత బీజాలు నాటిన వారికి నికరంగా వచ్చిన
ఆదా ఎంతో తెలీదు నాకు
చరిత్రను వెనక్కు మళ్ళింప జూస్తున్న వారి
చేతుల్లో ఎంత బలముందో తెలీదు నాకు
ఇల్లలుకుతూ అలుకుతూ ఈగ తన పేరు తాను మరిచిపోయినట్లు
ఇటీవల మన తెలుగువాండ్లు తమ ఊరూ పేరూ మరచిపోయి
ఊరేగారు వీధుల వెంట!
అవును ప్రజలు నిజంగా నిద్రపోతున్నారు
చైతన్యం చంద్రమండలానికి వలస పోయింది
మనిషి కత్తికి పదును పోయింది
చరిత్ర పొలంలో నాట దలచుకున్న
పైరుకు అదును పోయింది
పామరుడు పొదలో పొంచి కూర్చున్నాడు
పాములా కాటేస్తాడు బహుపరాకే
తెల్లవరకుండా సూర్యుడికి మబ్బులు అడ్డు వస్తున్న
బడాబడా ఖామందులు బహుపరాకే!

 65. ఉగ్రనేత్రం తెరచి ఉరికింది తెలుగు

కడలి అంచులు దాటి కదిలింది తెలుగు
ఎదల లోతులు మీటి ఎగిసింది తెలుగు
ఇటు మలేషియ నుంచి అటు అమెరికా వరకు
నలుదిశల గొంతుకల పలికింది తెలుగు
పెనుయెడారులలోన ఇనుప దారులలోన
పలుకు పలుకున జీవమలికింది తెలుగు
ఎక్కడున్న ఎన్ని చిక్కులున్న సరే
తలేత్తి నిలుపుమని తెలిపింది తెలుగు
ఏ భాష వేణుకైన ఏ వాన చినుకైన
తనలోన కలుపుకుని తరలింది తెలుగు
బరిగొదిగి పోతన్న బరవళ్ళతో సాగి
హమ్మంటు వేమనగ ఉరిమింది తెలుగు
అభినయానికి హృదయ మర్పించుకొని కూచి
పూడియే నాడిగా ఆడింది తెలుగు
సంగీతమే జీవసంపుటిగ త్యాగయ్య
ప్రతిపదంలో కరిగి పాడింది తెలుగు
పల్లె పాటలలో పభంధ నాటికలలో
కలికి బయ్యారాలు చిలికింది తెలుగు
స్వాతంత్ర్య సమరాన స్వచ్చంధగతులీన
ఉగ్రనేత్రం తెరిచి ఉరికింది తెలుగు
శాంతికి కపోతమైన క్రాంతి జలపాతమై
నిత్యవర్థిష్ణువై నిలిచింది తెలుగు

 66. ఎవడయ్య ఎవడు వాడు

శాతవాహనుల్ వంశాన పుట్టినవాడు
కాకతీయుల పోతుగడ్డ మెట్టినవాడు
పల్లెలోని కాదు ఢిల్లీలో సైతమ్ము
పెద్ద గద్దెల నేలి పేరుకెక్కినవాడు
ఎవడయ్య ఎవడువాడు ఇం
కెవడయ్య తెలుగువాడు!
పంచెకట్టుటలో ప్రపంచాన మొంగాడు
కండువా లేనిదే గడప దాటనివాడు
పంచభక్ష్యాలు ఆన కంచాన వడ్డించ
గోంగూర కోసమై గుటక లేసేవాడు ||ఎవడయ్య||!
తెలుగు బాసను జుంటితేనెయని తెగపొగడి
పొరిగింటి పులుపుకై మరులు పెంచినవాడు
దేశ భాషలలోన తెలుగు లెస్సని చాటి
మల్లెలకు బదులు లిల్లీలు వలచినవాడు ||ఎవడయ్య||
ఒక చేతి మజ్జిగని బరసి పట్టినవాడు
ఒక చేతి మధుపాత్ర వొదిలి పెట్టనివాడు
ఒక ముహుర్తాన ఇంచుక బుర్రగోకుకొని
చల్ల వంచిన చేత కల్లు పంచినవాడు ||ఎవడయ్య||
నేల నల్దెసల డేరాలు నాటినవాడు
అన్ని మూసలలోన అట్టె బదిగినవాడు
ఏ దేశమేగిన ఎందు కాలిడినా
ఆవకాయ వియోగ మసలె సైపనివాడు

 67.కలిసి పాడుదాం

కలసి పాడుదాం తెలుగుపాట
కదలి సాగుదాం వెలుగుబాట
తెలుగువారు నవజీవన నిర్మాతలనీ
తెలుగుజాతి సకలావనికే జ్యోతియని||కలసి||
కార్యశూరుడు వీరేశలింగం
కలం పట్టి పోరాడిన సింగం
దురాచారాల దురాగతాలను
తుదముట్టించిన అగ్ని తరంగం
అడుగో అతడే వీరేశలింగం.....
మగవాడెంతటి ముసలాడైనా
మళ్ళీ పెళ్ళికి అర్హవుతుంటే
బ్రతుకే తెలియని బాలవితంతువు
కెందుకు లేదా హక్కంటాను.....
చేతికి గాజులు తొడిగాడు
చెదిరిన తిలకం దిద్దాడు
మోడువారిన ఆడబ్రతుకుల
పసుపుకుంకుమ నిలిపాడు.....
అడుగో అతడే గురజాడ
మంచి చెడ్డలు లోకమందున
ఎంచి చూడగా రెండు కులములు
మంచియన్నది మాలయైతే
మాలనేనౌతాను అన్నాడు....
.

 68.కోహినూరు

తెనుగు తల్లీ! నీకు జోహారు
దేశమాతా! నీకు జేజేలు
నిను జూచి నిను బాడి నిను గొల్పు వేళ నా
కను లాణిముత్యాల గనులుగా నగు నహొ! ||తెనుగు తల్లీ!||
నీ పాలు జుంటి తేనియల తేటలో గోస్త
నీ పక్వరసమో సుధా పురమో యోట
నా పల్కు లీ లీయనకు నోని విశ్వవా
ణీ ప్రపంచ ప్రశంసాపూరితము లాయె ||తెనుగు||
కుటిల శాత్రన కోటిగుండెలో నిదురించి
యిటు సేతు సటుగంగ యెల్లంగా జగమేలు
నటరాజ కంఠవైశాల్యము నడగించు
నటుకీర్తి పెంచె నట్టి యెంతటి వాడో ||తెనుగు||
ఎల్లోర కొండ నీ యల్లారు గీమటీ
కొల్లూరి కోహినూరు కొప్పులో బూచటీ
కోలారు గనులు నీ కోశంబటీ పండ్లు
పుల్లనైపోవు భోగమ్ము కన్నచో ||తెనుగు||
గౌతమీ కృష్ణనదీ తుంగభద్రాది
వూత స్రవంతికా పుంజమ్ము నీ ముద్దు
కూతురై నీ చను నీ తోట పండింప
నీ తనూజులు పైడి పాతఱల్ కప్పిరే ||తెనుగు||
నీ పుణ్యలేశమ్ము నాపాలి దాయనో
నా పూజకే లోకనాధుండు పొంగెనో
నీ పావనోదర శ్రీపరంపరలలో
నీ సదార్చనులలో నేను నొక్కడనైతి ||తెనుగు||


69.గాంధీ పుట్టిన దేశమా ఇది

శాతవాహనుల్ వంశాన పుట్టినవాడు
గాంధీ పుట్టిన దేశమా ఇది నెహ్రూ కోరిన సంఘమా ఇది
సామ్యవాదం రామరాజ్యం సంభవించే కాలమా || గాంధీ ||
సస్యశ్యామల దేశం అయినా నిత్యం క్షామం
ఉప్పొంగే నదులు జీవజలాలు ఉపు సమురాల పాలు
యువకుల శక్తిని భవితవ్యానికి ఇక్కడ తిలోదకాలు
ఉన్నది మనకూ ఓటు బ్రతుకు తెరువుకే లోటు || గాంధీ ||
సమ్మె ఘెరావు దొమ్మీ బస్సుల దహనం లూటీ
అధికారంకై తగవులాటలో అన్నదమ్ముల పోటీ
హెచ్చెను హింసా ద్వేషం ఏమవుతుంది దేశం || గాంధీ ||
వ్యాపారాలకు పర్మిట్ వ్యవహారాలను లైసెన్సు
అర్హతలేని ఉద్యోగాలు లంచం యిస్తే ఓయస్
సిఫార్సు లేనిదే స్మశానమందు దొరకదు రవ్వంత చోటు
ప్రేరుకు ప్రజలది రాజ్యం పెత్తందార్లదే భోజ్యం || గాంధీ ||

70.గురిపెట్టిన మన గాండీవం

యువ భారత యుగోదయంలో
నవభారత మహొదయంలో
పూచిందొక అరున తరంగం
లేచిందొక క్రాంతి విహంగం
కంఠంలో విప్లవ రాగం
గమనంలో విద్యుద్వేగం
దేశానికి నవసందేశం
లోకానికి నూత్నాలోకం
త్యాగోజ్వల మహిమామండిత
రాగారుణ రక్తపతాకం
నవభారత హృదయాంబరమున
ప్రసరించిన మహేంద్ర వాసం
చైతన్యం జీవిత లక్ష్యం
స్వాతంత్ర్య అంతస్సాక్ష్యం
ప్రాచీ దిగ్ దృంగంచలంలో
రోజస్సుల చిలికే కిరణం
అజ్ఞాతం అతిక్రమించిన
ప్రజ్ఞామయ విజయ విహారం
కురుక్షేత్ర సంగ్రామానికి
గురిపెట్టిన మన గాండీవం
Reactions

0 Comments:

Post a comment

Latest Jobs

More

Jobs Info

More
Top