Thursday, 10 August 2017

దేశ భక్తి గీతాలు@8

దేశ భక్తి గీతాలు@8
 జయము జయము భరతావని!

జయము జయము భరతావని!
సకల భువన పావనీ!
జయము జయము స్వేచ్చాప్రియ
జనతా సంజీవనీ!
అరుణారుణ చరణ కిరణ
కరుణా రసవాహినీ!
క్షమతాప్రియ మమతామయ
సమతా సమ్మోహినీ!
ధర్మవీర సమరధీర
దానశూర జనయిత్రీ!
నిర్మల విజ్ఞాన ధాత్రి!
కార్మిక కర్షక సవిత్రి!
మలయ పవన చలమపవన
కలిత లలిత హరితాంబర!
అతి సుందర సరిదంతర
ప్రతి బింబిత నీలాంబర!
పాటల సుమ సుకుమారీ!
కోటి కోటి నరనారీ!
గళమంగల విజయవాణి!
లలితకళా కల్యాణీ! 

2.జననీ జన్మ భూమిశ్చ

జననీ జన్మ భూమిశ్చ స్వర్గాదపీ గరీయసి స్వర్గాదపీ గరీయసి
ఏ తల్లి నిను కన్నదో ఆతల్లినే కన్నభూమి గొప్పదిరా ||2|| ||జననీ||
నీ తల్లి మోసేది నవమాసాలేరా ఈ తల్లి మోయాలి కడవరకురా కట్టె కాలే వరకురా
ఆ రుణం తలకొరివితో తీరేనురా ఈ రుణం మరి ఏ రూపాన తీరేను
ఆ రూపమే ఈ జవానురా త్యాగానికి మరో రూపు నువ్వురా ||జననీ||
గుండె గుండెకు తెలుసు గుండె బరువెంతో
ఆ గుండెకే తెలుసు గుండె కోత బాధెంతో
ఈ గుండె రాయి కావాలి ఆ గుండెల్లో ఫిరంగులు మోగాలి
మనిషిగా పుట్టిన ఓ మనిషీ మారాలి నువ్వు రాక్షసుడిగా
మనుషుల కోసం ఈ మనుషుల కోసం ఈ మనుషుల కోసం ||జననీ||

3.జన్మభూమి

జన్మభూమి కన్న స్వర్గంబు వేరేది
మాతృభాష కన్న మధుర మేది
తల్లికన్న వేరె దైవమింకేదిరా?
తెలియుమోయి నీవు తెలుగు బిడ్డ!
మధుర మధురమైన మనభాషకంతెను
చక్కనైన భాష జగతి లేదు
పాలకంటె తనయులకే పలు
బలమునీయ గలవు తెలుగుబిడ్డ!
అలర పలనాటి బాలుడే అన్న యనుము
అమర రుద్రమదేవి నా కప్ప యనుము
తిక్కనామాత్యుడే గురుదేవు డనుము
ఇట్టి వీరాంధ్రజాతిలో బుట్టి అనుము

74.తల్లీ భారతి

స్వాతంత్ర్యమే మా జన్మహక్కని చాటండి
నిరంకుసము శక్తి అయినా
నిర్ణయముగా ఎదిరించండి
నదుల న్యాయమున బాధలు పొంది
బ్రతికిన చచ్చిన భేదములేదు నరుల || స్వాతం ||
కవోష్ట రుధీర జ్వాలల తోటి
స్వాతంత్ర్య సమరం నడపండి
ఎంతకాలమిటు దహించుయున్న
దోపిడి మూకకు దయరాదన్న - ఎంత || స్వాతం ||
సహ్ఘములలోను ఐక్యంలేదని
నలకలపడికు శాంతి వధాన
స్వర్ణ తుల్లమౌ స్వతంత్ర జ్యోతికి
మాంగల్యపు హారతులమ్మా || స్వాతం ||
సీతా మొగల్ రణధీరు కాంతి యాదోసే
జాన్సీల స్వాతంత్ర్య సమరదీప్తి
త్యాగమూర్తులు తిలకే దాదా ఫిరోజు
మాల్యన మన గాంధీ మహీర శక్తి
జాతీయ సంయోకామ్యా హింసతోడ
కాంగ్రేస్సు నడిపించిన కదన రేగతి
తమిళ, ఆంధ్ర, కేరళ దారిణి ప్రజలెల్ల
ధారపోసిన మహాత్యాగ ఫలము
మాతృదేశముగాన క్షాత్రమూసినబోను
బడరాని ఇడుముల బడిన క్రమము
పండిత నెహ్రూజీ పటేలు పట్టాభి
రాజాజీ నెరసిన రాజ్య పటిమ
భారతీయుల పుణ్యంబు పుచ్చెననెగా
వచ్చెనదిగో సుస్వాతంత్ర్య వత్సరము
పొత్తుకూడక సుఖముల పొందరయ్య
తల్లి భారతి విభనమ్ము వెల్లివిరియు

5.తెనుగుబాస

మంచి గుమ్మడికన్న దంచిన యెఱ్రని
క్రొప్పడ్ల బియ్యము కూడుకన్న
మేల్ జహంగీరు మామిడి పండుకన్న నుం
కాఱున లే సజ్జ కంకికన్న
కమియ పండిన ద్రాక్షకన్న, చెక్కర తీగ
బోసి పండిన పాల బువ్వకన్న
రస దాడికన్న పనస తొనకన్న క
జూరముకన్నను జున్నుకన్న
అలతి పెరతీనియలకన్న నామని తఱి
కొసరి కూసిన కోయిల కూతకన్న
ముద్దు లొలికెడి జవరాలి మానికన్న
తెయ్యనైన దెయ్యది? యదే తెనుగు బాస
కడిది యక్కరముల కలయిక సమసక
మ్మన దయ్యు నూగించు పసరు కలది
వీణ యూదిన యట్లు కూర్చు కలది
శివకవి హరిహర కవులకు మఱచిపో
నటుల జనుల చేసి నలవు కలది
తొమ్మిది లక్షల దొడ్డ పోటది విండ్ల
నారి మ్రోయించిన ధీర గలది
మీరు కృషి చేయనిది నీటి మీ కయిలకు
పట్టుదల లేనిది తెనుంగు బాసయంచు
గుర్తెరుగు డోయి దేశమున్ గుస్తరించు
ననుగులార! వల్బాసల మఱుగులార!
ఈ బాస ధూర్జటి పేలాపనగ బల్కి
కన్నబోయడు ముత్తికాలు ద్రొక్కె
ఈ బాసలో లా కు నేర్వము దా కు కొ
మ్మీయక భాస్కరు డిపుడు నుండె
ఈ బాస మాటాడి యెల్లరు గణపతి
ఒక్క గొడుగు నీడ నుంచి మురిసి
ఈ బాసతో కాపుటిండ్ల పాలించి రా
యక్ భువన విజయం బందుకొనియె
క్రోల్పులిని చూచి కుందేలు గుఱ్రుమనిన
చప్పు డీ బాసలోనిది చెప్పవచ్చు
నెంతయేని తెంగొందన మంత గూర్చి
దీని కీనాడు పట్టిన దిగులు గూర్చి
కడుపు కొఱకును మిక్కిలి ముడుపు కొఱకు
కీర్తి కొఱ కధికార విస్పూర్తి కొఱకు
నెన్ని వేసాలు వేసిన నేమికాని
మాతృభాష చక్కగ నేర్చి మనుత నరుడు
పైడికి నింబదమ్మునకు ప్రాతలు క్రొత్తలు లేవు లేనిచో
వాడుక లేనియట్లే యగు బావి జలమ్ములు వోలె శబ్దముల్
వాడు కొలంది శోభలును పంతము పట్టుడి నేడు నాల్కపై
నాడవలెన్ చతుర్విధ మహాంధ్ర మశేష మటంచు నాంధ్రజు;
మూవురు లింగ మూర్తులకు భోగము సెల్లెడు నంతదాక గో
దావరి పాయ పాయ వఱదల్ రవళీంచెడు నంతదాక కృ
షా నిమిలాంబు పూరమున చంద్రిక లాడెడు నంత దాక నాం
ద్రావని కైత జోతి కఖిలావని పళ్ళెరమై తనర్చుతిన్

6.తెలుగు దేశమే నాది

తెలుగు దేశమే నాది తెలుగు బిడ్డనే నేను
తెలుగు పేరు వింటేనే మురిసిపోతాను
తెలుగు భాష అంటే మైమరచిపోతాను
నన్నయ భట్టిక్కడనే పుట్టినాడు
తిక్కన కవి ఘంట మిచట పట్టినాడు
పోతన్నలు, శ్రీనాధులు రామరాహు భూషణులు
తెలుగు భాషకై వన్నెలు దిద్దినారు
తెలుగు జాతి నాల్కలపై నిలిచినారు
ఆట వెలదులను ముద్దుల మూటగట్టె వేమన్న
భావి కాలగతుల తెలియ బల్కెడు వీరబ్రహ్మం
కర్ణాటక గానానికి కళదెచ్చెను త్యాగరాజు
ఇంతటి విజ్ఞాన ధనులు ఎవరున్నారు
వెదకి చూచినా గాని కానరారు
బరిపై తొడగొట్టి, కత్తి బట్టెను నాయకురాలు
పురుష వేషమున శత్రుల మారుమాడెను రుద్రమ్మ
మొల్లలు మల్లమ దేవులు మహిళలకే మణిపూసలు
తెలుగు గడ్డకే పేరు దెచ్చినారు
స్త్రీ జాతికి గౌరవమ్ము నిచ్చినారు
ఓరుగల్లు నేలిన శూరుడు ప్రతాపరుద్రుడు
పౌరుషమ్ము చింధించిన బాలచంద్రుడు
రాచకొండ వెలను దొరలు కొండవీటి రెడ్డి విభులు
మన ప్రతాపమునకు బలే మచ్చు తునకలు
వేడి నెత్తురు పారించిన వీరపుత్రులు
కలియుగ భీముడని బిరుదు గొన్న కోడి రామమూర్తి
అద్భుత మేధావిగా, పేరందిన విశ్వేశ్వరయ్య
జగము మెచ్చు రాధాకృష్ణ, త్యాగమూర్తి ప్రకాశం
గత్యసాయి బాబాలు మనవాళ్ళంటే చాలు
సింహాచల మప్పన్న శ్రీశైలం మల్లన్న
యాదగిరి నరసింహ ఏడుకొండల వెంకన్న
వీరంతా తెలుగువారి కిలవేలుపులు
మహిమలు జూపించునట్టి మన దేవుళ్ళు
కృష్ణా, గోదావరులు, కేరింతలు గొడుతున్నవి
తుంగభద్ర మంజీరలు అంగలు వేస్తున్నవి
నిత్యము ప్రవహించుచున్న నిర్మలమగు జీవనదులు
బంగారపు పంటలు పండిస్తున్న వీ
కరువు రక్కిసిని దూరం తరుముతున్నవీ
తెలుగువాడు ఏడనున్న, తెలుగువాడు
తెలుగు బాషనే సొంపుగ పలుకుతాడు
మరచిపోని అతని కట్టు మారిపోని అతని బొట్టు
తలచుకున్న రోమ రోమం పులకరిస్తుంది
అభిమానం పొంగిపొరలి ఉరకలేస్తుంది

7.తెలుగు పతాక గీతం

తెలుగు పతాకమా...
మా జాతి పతాకమా...
ఎగరవేస్తాం మళ్ళీ పైపైకీ
మా గుండెల ఊపిరి పోసే ||తెలుగు||

ఒక్కోతరం, ఒక్కోతరం 

ఎంత నలిగిపొయ్యావో...
ఏ చీకటి దుమ్ములో
ఎంత మాసిపొయ్యావో...
నీ ఏపుకు అడ్డమైన ప్రతికంపను పెళ్లగించి
జనం బతుకు మలుపుల్లో ఏరువాక పొంగిస్తాం ||తెలుగు||

ఏ అవసర దూరాలను
నీ గొంతై కలుపునో...
ఏ అలజడి తీరాలను
నీ నడకై నిలుపునో...
అదే యాస, అదే బాస శ్వాసశ్వాసకూ పంచీ
ఉద్యమాల కనురెప్పల రెపరెపలై జీవిస్తాం ||తెలుగు||

8.తెలుగుతల్లి

సిరుల నిచ్చే కన్నతల్లి!
శుభము గూర్చే కల్పవల్లి!
దీవెనల దయచేయవే భూ
దేవి మనకి తెనుగు తల్లి!
కల్లకపటము లేము తెలియని
పిల్లలందరి ప్రేమజూపి!
ఎల్లవేళల నీదు కృప వెద
జల్లి బ్రొవవె? పాలవెల్లి!
విద్యలొసగవె మాకు జననీ
బుద్దిగరపవె ఆంధ్రవాణి
పాడిపంటల నిచ్చి యందరి
కడుపు నింపనే కృష్ణవాణి
బాలచంద్రుని పాపరాయుని
మల్లమాంబను గంటివమ్మా
పౌరుషముతో తెలుగు వీరుల
తీర్చిదిద్ది తరలిస్తివమ్మా!

9.తెలుగుదనము తీయదనము

తెనుగుదనము వంటి తీయదనము లేదు
తెనుగు కవులవంటి ఘనులు లేరు
తెనుగుతల్లి సాధుజన కల్పవల్లి రా
లలిత సుగుణజాల! తెలుగు బాల!
కష్టబెట్టబోకు కన్నతల్లి మనస్సు
నష్టబెట్టబోకు నాన్న పనులు
తల్లిదండ్రులన్న దైవ సన్నిధులురా
లలిత సుగుణజాల! తెలుగు బాల!
బడికి నడువలేడు; పాఠాలు వినలేడు;
చిన్న పద్య మప్పజెప్పలేడు
రాజరాజు బిడ్డరా నేటి విద్యార్థి!
లలిత సుగుణజాల! తెలుగుబాల!
బ్రతికినన్ని నాళ్ళు ఫలములిచ్చుటెగాదు
చచ్చికూడ చీల్చి యిచ్చు తనువు
త్యాగభావమునకు తరుపులే గురువులు!
లలిత సుగుణజాల! తెలుగుబాల!
దొరలు దోచలేరు దొంగలెత్తుకపోరు;
భాత్ర్పజనము వచ్చి పంచుకోరు
విశ్వవర్ధనంబు విద్యా ధనంబురా
లలిత సుగుణజాల! తెలుగుబాల!

10.తెలుగునేల

ప్రాచీన సంస్కృతీ పరిఢవిల్లిన నేల
పౌరుషాగ్నికి పేరుపడిన నేల
జాతీయ స్పూర్తికి జయకేతమౌనేల
జాగృతీ క్రతువులన్ జరుపునేల
పరమస్వంతంత్రేచ్చ పరిమళించెడు నేల
పోరులో వెన్నొడిబోని నేల
చేతనాయుతమైన చేవకల్గిన నేల
వీరులగన్న బంగారునేల
వెలుగు జిలుగుల నెలబాల తెలుగునేల
దిక్కులేక రాహూవునోట చిక్కెనేడు
చక్రిపైలేచి చూపు పరాక్రమమ్ము
కలిగిన ధీరుడా తెలుగువాడ:
Reactions

0 Comments:

Post a comment

Latest Jobs

More

Jobs Info

More
Top