Thursday, 10 August 2017

దేశ భక్తి గీతాలు@9

దేశ భక్తి గీతాలు@9 
1.నవభారతదేశం

ఇది సుందర దేశం నవభారత దేశం
మృదు మంజులనాదం పురిగొల్పిన వేదం ||ఇది||
గల గల గల సవ్వడి గమకాలకు పల్లవి
అలనురగల వెల్లుడి పలికించిన అల్లరి
జ్వనదులె సంగమ సారాలకు తేటని
ప్రేమ ఎదల కలయికయే వెలుగొందిన జీవని ||ఇది||
కులమతమను బేధము మనకెందుకు మిత్రుడా!
మతమౌధ్యాలెందుకు? భరతజాతి పుత్రుడా!
భాషలు వేరైనను భావమొకటి కనుమరా
భేదము లెంచకురా భారతికే మొప్పరా ||ఇది||
మారణ హొమాలను రగిలించుట తగదని
మానసదీపాలను వెలిగించుట సుఖమని
నడవడు లొకటైతే కలదందున రసధుని
కులమతమను తేడాలను వీడితే శుభశశి ||ఇది||

2.తేనెకన్న మధురం మన తెలుగు

తేనెకన్న మధురం రా, తెలుగు ఆ
తెలుగుదనం మా కంటి వెలుగు
తెలుగుగడ్డ పోతుగడ్డ ఎంత పచ్చన, మా
తెలుగు దుండెలో స్నేహము ఎంత చెప్పన!
మన పొలాల శాంతి పులుగు ఎంత తెల్లన, మన
తరతరాల కధను పాడు గుండె ఝుల్లున
పాటుపడిన వాళ్ళకే లోటు లేదను
చాటి చెప్పు తల్లికదా తెలుగుతల్లి
లలితకళలి సంగీతం సాహిత్యం
తెలుగు తల్లి జీవితాన దినకృత్యాలు
గత చరిత్ర మన చరిఒత్ర ఎంత ఖ్యాతి!
గర్వించదగ్గ జాతి తెలుగు జాతి!
అయినా గతంకన్న భవిషత్త్య్ ఆశాజనకం
ఆ భావికొరకు ధరించాలి దీక్షాతిలకం

3.నన్నుగన్న తల్లి

నన్నుగన్న తల్లి! నా భాగ్యమా!
నారాయణి! ధర్మాంబికే
నన్నుగన్న తల్లి! నా భాగ్యమా!
నారాయణి! ధర్మాంబికే
కనకాంగి! రామావతి సోదరి!
కాదనీ నను, కాత్యాయని!
నన్నుగన్న తల్లి! నా భాగ్యమా!
నారాయణి! ధర్మాంబికే
కావుకావుమని నీ మొఱబెట్టగా
కనులలోచన! కరుగుచుండగా,
నీవు బ్రోవకున్న నెవరు బ్రోతురు? స
దా వరంబొసగు త్యాగరాజనుతి
నన్నుగన్న తల్లి! నా భాగ్యమా!
నారాయణి! ధర్మాంబికే!

4.నమ్మలేనంతగా నేడు

కొన్ని పుష్కరాల క్రితం తెలుగుజాతి వృక్షం పుష్పించింది
పుష్పించి వివిధ శాఖల
ఏకతా పరీమళాల శోభలను గుప్పించింది
పువ్వు ఫలంగా పరిణామం చెందే పరిణతి దశలో
నవ్వుల పాలైంది తెలుగుజాతి నమ్మలేనంతగా నేడు
తెలుగు జాతి వెలుగు జాతి
భాషా ప్రాతిపదిక ప్రమిదలో
ఐక్యత కాంతులు ప్రసరించిన దినం - నాడు
ముక్కోటి తెలుగువారి
మూడు ప్రాంతాలను ముడ్లెవేసి
మంగళ సూత్రంలా బంధించిన దినం - నాడు
సస్యశ్యామల సంభరిత శోభావృత ప్రాంతములు
సోదర భావ సంపన్నతి నందించి
వాత్సల్యామృతం గర్వంగా పంచుకున్న దినం - నాడు
కల లీడేరాలని తెలుగుజాతి జగత్కల్యాణ
సంఘటిత ప్రమాదాలకు
కంకణం కట్టుకున్న దినం - నాడు
శ్రీ రాములు దయచేతను
ఆరూఢిగ సకల జనులు నౌరాయనగా
అవతరించిన సంఘటిత తెలుగు దేశం
ఆయన రక్తాశ్రువుల జనించిన
గారాలు పట్టి పుట్టిన దినం - నాడు
తరతరాలు తెగి విడివడిన
తమ రావృత త్రిలింగ దేశం
పరస్పర ప్రేమాస్పద స్పందనలో
ఆనందపు దివ్వెలు వెలిగించిన దీపావళి - నాడు
ఆనాడు నేడై మోడుగా మారితిరి
కలలన్ని శిలలై కూకటి వ్రేళ్ళ ప్రసరణ స్థంభన చేసింది
కొద్ది తుఫాను గాలి చాలు వాలి రాలి పోడానికి
అశోకుడు నాటిన వృక్షం
అక్బరు పెంచిన చెట్టు అక్బరు పెంచిన చెట్టు
అన్నీ బోధించే దొకటే ఆ నీడలో అనురాగ స్పందనం
చరిత్ర చెరిగి పోయినా చెట్టు కనిపించక పోయినా
ఫలరసాస్వాదనలో ఆనాడు
ఫలించినవి జాతి ఆశలు ఆశయాలు
పువ్వు ఫలంగా పరిణామం చెందే పరిణత దశలో
నవ్వుల పాలైందితెలుగు జాతి
నమ్మలేనంతగా నేడు
ఉమ్మడి కుటుంబాలు గుంపుగా కలిసి బ్రతుకుతున్నాయి
దేశాంతర పరిణయాల జంటలు హాయిగా కలిసి జీవిస్తున్నారు
సర్వ జీవ జాల జాతుల్లో అనైక్యత లేనే లేదు
ఒకే గూటి పక్షుల్లో వేరు బ్రతుకు మిధ్య కాని
తెలుగుజాతి గూటిలో తెగులొకటి ఉద్భవించింది
తెలుగు భూమి బ్రద్దలయే భూకంపన శబ్దించింది
నాడు నేడై మాడిన మాడు రూపంలో ప్రతిబింబిస్తోంది
కొన్ని పుష్కరాల క్రితం తెలుగుజాతి వృక్షం పుష్పించింది
పుష్పించింది వివిధ శాఖల ఏకతా పరీమళాలను గుప్పించింది
తెలుగు జాతి వృక్షానికి తోటమాలి ఎవరైతేనేం?
కాలం పరిధిలో ఐక్యత తోయం పోయాలి కాని
పుష్ప పరిమళాలు ఫలరసాల చైతన్యం
పంపకం ఔచిత్యంతో ఫలప్రదం కావాలి
నరకాసుర వధతో దీపావళి వెలసింది నాడు
నరాసురులిచ్చే వ్యధలు బాపితేనే దీపావళి నేడు
అసుర శక్తులనినుమడించిన గతి తప్పిన మతుల
నఖ్యాతంలోకి త్రోసి సంతృప్తి సమాధులు కట్టాలి
శాతవాహనుల సహస్త్ర శతజయంతులు
ప్రతాపరుద్రుని సర్ణాంధ్ర గర్వకీర్తి
కృష్ణరాయని కర్ణాకర్ణ ధీధీతి
నన్నయ తిక్కనల భారత కవితా సౌరభాలు
బమ్మెర పోతన జగబ్ద్భిత భాగవత కర్పూర హారతి
గత చరిత్రలోంచి దాతలు వల్లించే కీర్తి మాతలు
దరిద్ర నారాయణుడవు నీవు
వీటిపై వరభాగ్యోన జీవిగా బ్రతకడం దేనికి
వర్తమాన చరిత్ర పుటలు భవిష్యత్తుకు ఉజ్జ్వల బాటలు కావాలి
వంకర గుంటల బాటలు చరిత్ర వాహనానికే ముప్పు
రుతువుల రాపిడిలో వృక్ష స్వరూపం మారినా
స్థిత ప్రజ్ఞ కూడిన సజీవ శక్త్రి నిత్యం వెలగాలి
దేశసర్వతోముఖ సంపన్నత అణువే దేశ వృద్ధి
జాతుల బహుముఖ ఉద్దీపనమే దేశ వృద్ధి
తరాల నుంచి మరలుగా పనిచేసే మానవ బుద్ధి
భారత నూతన చైతన్య వాశిత సమాజానికే ముద్దు
తెలుగుజాతి వెలుగు జోతిరోషద్వేషాల నుసి ప్రమిదతో
శాంతిద్రవ ఆద్రతతో ఐక్యకాంతులు వెదజల్లాలి నేడు

5.నా జన్మభూమి

నా జన్మభూమి... భూమి... భూమి...
నా జన్మభూమి ఎంత అందమయిన దేశము
నా యిల్లు అందులోని కమ్మని ప్రదేశము
నా సామిరంగ హొయ్ హొయ్ నా సామిరంగ ||నా జన్మభూమి||
నడిచే దారిలో నవ్వే పువ్వులు
శాంతి నాదాలతో ఎగిరే పిట్టలు ||నడిచే||
పచ్చని పంటలు వెచ్చని జంటలు
చల్లని జీవితం ఇదే నవభారతం హొయ్ నా సామిరంగ || నా జన్మ||
బతకాలందరు దేశం కోసము
దేశమంటేను మట్టికాదోయ్ మనుష్యులోయ్
స్వార్ధము వంచనా లేనిదే పుణ్యము
త్యాగమూ రాగమూ మిళితమే ధన్యహొవోయ్ నా సామిరంగ ||నా జన్మ||

6.నా దేశము

గౌతమీ కృష్ణవేణీ తుంగభద్ర పె
న్నా నదుల్ పాఱు మాగాణి గడ్డ
భ్రమరాంబ, కనకదుర్గాదేవి, వెంకన్న
పొత్తిళ్ళ బెంచిన ముద్దు బిడ్డ
నాగార్జున, విజయనగర, వినూత్న క
ళా సరస్వతుల విలాస భూమి
నన్నయ్య, యజ్వ తిక్కన్న, పోతన్నది
కవుల వాగ్వల్లి బంగారు తల్లి
సృష్ణరాయ మహీజూని, విష్ణువర్ణ
నాది నృప బాహు దండంబులందు నలం
మఱల స్వేచ్చాప్రపూర్ణయై మాన్యమైన
ఆంధ్ర్మాతకు భక్తి జోహారు లిడుచు
కట్టిన దాంధ్రమాత యిడు కమ్మని ఖద్దరు బట్ట, వెన్నతో
బెట్టిన విద్యలే సహజ వీర పరాక్రమ శౌర్య సంపదల్
పుట్టిన దాంధ్రదేశమని పొంగని యాంధ్రుడొకండు కల్గునే
పుట్టిన దేశమాత రుణమున్ సరిదీర్చిననాడె యాంధ్రుడున్
ఏ నాంధ్రుండను, పుట్టి పెర్గితి కదోయి అంధ్రదేశాననీ
నా నోటన్ వినుభెల్ల, కాలమనది యాంధ్రమ్మాయి, యీ దేశమం
తా నా దేశమే, స్వీయ రక్త మది, ఆంధ్రంబేకదా యంచున్‌
నానందింపని వాడొకండు కలడే, అంధ్రేతరుండున్ వినా
తెలుగు దేశము నాయది, తెనుగు వాడ
తెలుగుతల్లి యనుంగు చేతులను బెరిగి
తెలిసి గొంటిని, మంటిని, తెలుగు తల్లి
పేరు నిలుపుటె మీదె యూపిరి జెలంగ

7.నేనూ నా దేశం

నేనూ నా దేశం పవిత్ర భారతదేశం
అశోకుడేలిన ధర్మప్రదేశం బుద్ధుడు వెలిసిన శాంతిదేశం
బుద్ధం శరణం గచ్చామి ధర్మం శరణం గచ్చామి సంఘం
శరణం గచ్చామి ||అశో||
కులమత భేధం మాపిన త్యాగి అమరబాపూజీ వెలసిన దేశం
వందేమాతరం||3|| ||కుల, నేనూ||
కదం త్రొక్కిన వీరశివాజీ - 2 వీర విహారిణి ఝాన్సీరాణి||2||
స్వరాజ్య సమరుడు అల నేతాజీ ||జైహింద్‌||3||
కట్టబ్రహ్మాన్న పుట్టినదేశం ||నేనూ||
అజాద్‌ గోఖలే వల్లభాపటేలు లజపతి తిలక్‌ నౌరోజీలు||2||
అంబులు కురిపిన మన అల్లూరి భగత్‌ రక్తము చిందిన దేశం
హిందుస్తాన్‌హమరాహై ||నేనూ - 3||
గుండ్ల తుపాకి చూపిన దొరలకు గుండెచూపే మన ఆంధ్రకేసరి
శాంతిదూత మన జవహర్‌నెహ్రూ||3|| ||శాంతి||
లాల్‌ బహదూర్‌ జన్మించిన దేశం, జై జవాన్‌ జై కిసాన్‌ ||3|| ||నేనూ||
అదిగో స్వరాజ్య రధానసారధి - 2 ఆదర్శనారి ఇందిరాగాంధి గరీబీ హటావో ||3||
ఆదర్శనారి ఇందిరాగాంధి అడుగుజాడలో పయనిద్దాం
అఖండ విజయం సాదిద్దాం ||అ.ఆఖం.నేనూ||
సాటిలేనిది దీటురానిది శాంతికి నిలయం మనదేశం నేనూ నా దేశం ||3||

8.భారత దేశం మనదేర

||ప|| భారత దేశం మనదేర
భారతీయులం మనమంత
భారతదేశం మనదేర

1. చ భరతుడు ఏలిన రాజ్యముర
బుద్ధుడు పుట్టిన దేశముర
గాంధీ, నెహ్రూ, జనని ఇందిర
రాణి రుద్రమ వెలసిన క్షేత్రం ||భా||

2. చ ఒకటే కులముగ కలిసుంటాం
ఒకటే మతముగ నిలిచుంటాం
గాంధీతాత చెప్పిన సూక్తులు
మరవక మేము పాటిస్తాం ||భా||

3. చ జై జవానులమై రక్షిస్తాం
జై కిసానులమై పండిస్తాం
దేశం కోసం పిల్లలమంత
తూటాలై మేము దూసుకు వెళతాం ||భా||

4. చ శాంతికి మేము దూతలము
దేశభక్తికి వారసులం
శత్రువు లెవరైన మా జోలికి వస్తే
ఖబడ్దారంటు తరిమేస్తాం ||భా||

                             రచయిత్రి అప్పల బాలరత్నం

9.పండిత నెహ్రూ పుట్టినరోజు

పండిత నెహ్రూ పుట్టినరోజు పాపలందరికీ పుట్టినరోజు
సమతా మమతా పుట్టినరోజు మంచికి కోవెల కట్టిన రోజు
ముత్యం లాంటి మోతీలాలుకు రత్నం లా జన్మించాడు
జాతిరత్నమై వెలిగి ఇంకొక జాతిరత్నం ను కన్నాడు
అతడే జవహరులాలు అతనికి మన జేజేలు ||2|| ||పం||
తలపై తెల్లని టోపి ఎదపై ఎర్రగులాబి ||2|| ||పం||
పెదవులపై చిరునవ్వు మదిలో పున్నమినవ్వు
చేతిలో పావురం మనజాతికి అతడే గోపురం ||2|| ||పం||
మహాత్మాగాంధీ అడుగుజాడలో స్వరాజ్య సమరం నడిపారూ
రణదాహంతో రగిలే జగతిని శాంతి సుధలు కురిపించాడు
కన్నుమూసినా జవహర్‌లాల్‌ కంటిపాపగా వున్నాడు
ఇంటింట జ్యోతిగా వున్నాడు చాచానెహ్రూ అమర్‌ రహే ||3|| ||పం||

10.భారతమాతకు జేజేలు

భారత మాతకు జేజేలు బంగరు భూమికి జేజేలు
ఆ సేతు హిమాచల సస్యశ్యామల జీవ ధాత్రికి జేజేలు ||భారత||
త్రివేణి సంగమ పవిత్ర భూమి నాల్గు వేదములు పుట్టిన భూమి
గీతామృతమును పంచిన భూమి పంచశీల బోధించిన భూమి ||భారత||
శాంతి దూతగ వెలసిన బాపు, జాతి రత్నమై వెలిగిన నెహ్రూ
విప్లవ వీరులు వీర మాతలు ముద్దు బిడ్డలై మురిసిన భూమి ||భారత||
సహజీవనము సమభావనమూ సమతావాదము వేదముగా
ప్రజాస్వామ్యమే ప్రగతి మార్గముగ లక్ష్యములైన విలక్షణ భూమి ||భారత||

Reactions

0 Comments:

Post a comment

Latest Jobs

More

Jobs Info

More
Top