2.మా తెనుగు తల్లికి
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
మా కన్న తల్లికి మంగళారతులు
కడుపులో బంగారు కను చూపులో కరుణ
చిరునవ్వు లో సిరులు దొరలించు మా తల్లి
గల గలా గోదారి కదలి పోతుంటేను
బిర బిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను
బంగారు పంటలే పండుతాయి
మురిపాల ముత్యాలు దొరలు తాయి
అమరావతీ నగర అపురూప శిల్పాలు
త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు
తిక్కయ్య కలములో తియ్యందనాలు
నిత్యమై నిఖిలమై నిలచి యుండే దాక
రుద్రమ్మ భుజ శక్తి
మల్లమ్మ పతిభక్తి
తిమ్మరుసు ధీయుక్తి కృష్ణరాయల కీర్తి
మా చెవుల రింగుమని మారు మ్రోగే దాక
నీ ఆటలే ఆడుతాం
నీ పాటలే పాడుతాం
జై తెలుగు తల్లీ! జై తెలుగు తల్లీ! జై తెలుగు తల్లీ!
3.అంతా ఒక్కటే
అంతా ఒక్కటే మనమంతా ఒక్కటే, ఆంధ్రులమైనా తమిళులమైనా
ఉత్కళులైనా కన్నడులైనా
మరాఠి అయినా గుజరాత్ అయినా
పంజాబ్ అయినా బంగ్లా అయినా - !!అంతా!!
వందనమండీ వందనం
వణక్కమమ్మా వణక్కం
ఎస్సలాం ఎస్సలాం
నమస్కార్ నమస్కార్
భాషలు వేర్వేరయినాగానీ
భావాలన్నీ ఒకటేనోయ్,
దేశాలన్నీ ఒకటే అయితే ద్వేషాలేమీ ఉండవుగా,
బాలప్రపంచం, భావిప్రపంచం
భావిభారత వారసులం !!అంతా!!
- న్యాయపతి రాఘవరావు
6.నారాయణ నారాయణ అల్లా అల్లా
నారాయణ నారాయణ అల్లా అల్లా
మా పాలిట తండ్రీ నీ పిల్లల మే మెల్ల !!నారాయణ!!
మతమన్నది నాకంటికి మసకైతే
మతమన్నది నామనసుకు మబ్బైతే
మతం వద్దు గితం వద్దు మాయామర్మంవద్దు !!నారాయణ!!
ద్వేషాలు రోషాలు తెచ్చేదే మతమైతే
కలహాలు కక్షలు కలిగించేదే గతమైతే
మతం వద్దు గితం వద్దు
మారణ హోమం వద్దు !!నారాయణ!!
మతమన్నది గాంధీజీ హితమైతే
మతమన్నది లోకానికి హితమైతే
హిందువులం ముస్లిములం
అందరము మానవులం,
అందరమూ సోదరులం !!నారాయణ!!
మా పాలిట తండ్రీ నీ పిల్లల మే మెల్ల !!నారాయణ!!
మతమన్నది నాకంటికి మసకైతే
మతమన్నది నామనసుకు మబ్బైతే
మతం వద్దు గితం వద్దు మాయామర్మంవద్దు !!నారాయణ!!
ద్వేషాలు రోషాలు తెచ్చేదే మతమైతే
కలహాలు కక్షలు కలిగించేదే గతమైతే
మతం వద్దు గితం వద్దు
మారణ హోమం వద్దు !!నారాయణ!!
మతమన్నది గాంధీజీ హితమైతే
మతమన్నది లోకానికి హితమైతే
హిందువులం ముస్లిములం
అందరము మానవులం,
అందరమూ సోదరులం !!నారాయణ!!
7. పిల్లల్లారా పాపల్లారా
పిల్లల్లారా పాపల్లారా రేపటి భారతపౌరుల్లారా
పెద్దలకే ఒక దారిని చూపే పిన్నల్లారా పిల్లల్లారా
మీ కన్నుల్లో పున్నమి జాబిలి
ఉన్నాడు, ఉన్నాడు పొంచున్నాడు.
మీ మనస్సుల్లో దేవుడు కొలువై ఉన్నాడు.
ఉన్నాడు అతడున్నడు.
భారత మాతకు ముద్దులబిడ్డలు, మీరేలే మీరేలే
అమ్మకు మీపై అంతేలేని ప్రేమలే, పిల్లల్లారా ప్రేమేలే
రేపటి భారత పౌరుల్లారా...
భారత దేశం ఒకటేఇల్లు భారత మాతకు మీరే కళ్లు,
మీరే కళ్లు, మీరే కళ్లు
జాతిపతాకం పైకెగరేసి
జాతి గౌరవం కాపాడండి బడిలోబయటా అంతా కలిసి
భారతీయులై మెలగండి కన్యాకుమారికి కాశ్మీరానికి
అన్యోన్యతను పెంచండి వీడని బంధం వేయండి. పిల్లల్లారా!!
- దాశరథి
0 Comments:
Post a comment