Tuesday, 9 October 2018

Braou bed బీఈడీ కౌన్సెలింగ్‌

 అంబేద్కర్ వర్సిటీలో 14నుంచి బీఈడీ కౌన్సెలింగ్‌...
_డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో 2018-19 సంవత్సరానికి గాను బీఈడీ కోర్సు ప్రవేశాలు ఈ నెల 14 నుంచి ప్రారంభమవుతాయని విశ్వవిద్యాలయ విద్యార్థి సేవా విభాగం డైరెక్టర్‌ పి.కృష్ణారావు తెలిపారు. విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఈ కౌన్సెలింగ్‌ ఉంటుందన్నారు. తెలుగు రాష్ట్రాల్లోని పది కేంద్రాలకు సంబంధించిన ప్రవేశాలు హైదరాబాద్‌లోనే జరుగుతాయన్నారు. విశ్వవిద్యాలయం నిర్వహించిన ప్రవేశ పరీక్షలో ర్యాంకు సాధించిన అభ్యర్థులే ప్రవేశానికి అర్హులని పేర్కొన్నారు. అభ్యర్థులు ధ్రువపత్రాలు, తగిన రుసుం తీసుకొని హాజరుకావాలని సూచించారు. 14న ఉదయం 9 గంటలకు ఫిజిక్స్‌, మధ్యాహ్నం 12 గంటలకు బయోలాజికల్‌ సైన్స్‌, 15న 9 గంటలకు గణితం, 16న 9 గంటలకు సోషల్‌ స్టడీస్‌లకు కౌన్సెలింగ్‌ ఉంటుంది._
* బి.ఎడ్ అడ్మిషన్ షెడ్యూల్...*
https://braouonline.in/MISC/BEd_Schedules.aspx
* ప్రింట్ అప్లికేషన్ ఫారం...*
https://braouonline.in/BED/Print_Login.aspx
*ర్యాంక్ కార్డ్...*

https://braouonline.in/BED/BedResultsLogin.aspx
Reactions

0 Comments:

Post a comment

Latest Jobs

More

Jobs Info

More
Top