Saturday, 18 July 2020

19-07-2020 నుంచి 25-07-2020 వరకు మీ వార రాశి ఫలితాలు

🐏 *19-07-2020 నుంచి 25-07-2020 వరకు మీ వార రాశి ఫలితాలు*

మేషం: అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం
సంతోషకరమైన వార్తలు వింటారు. గృహం సందడిగా ఉంటుంది. ఉల్లాసంగా గడుపుతారు. ధనలాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. ఖర్చులు అధికం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆది, సోమ వారాల్లో చెల్లింపులో మెలకువ వహించండి. బ్యాంకు వివరాలు వెల్లడించవద్దు. పనులు ముగింపు దశలో హడావుడిగా సాగుతాయి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. మిత్రులు బంధువులతో తెగిపోయిన సంబంధాలు బలపడుతాయి. వ్యవహార ఒప్పందాలకు అనుకూలం. ఏవిషయాన్ని తెగేవరకు లాగవద్దు. సామరస్యంగా సమస్యలు పరిష్కరించుకోవాలి. ఆధ్యాత్మికత  పెంపొందుతుంది. వస్త్ర, బంగార వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. విదేశాల నుంచి సంతానం రాక ఉపశననం కలిగిస్తుంది.

వృషభం: కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర, 1, 2 పాదాలు
ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. రుణ సమస్యలు కొలిక్కి వస్తాయి. తాకట్టు విడిపించుకుంటారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. కొత్త విషయాలు తెలుసుకుంటారు. పనులు చురుకుగా సాగుతాయి. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఏజెన్సీలు, దళారులను విశ్వసించవద్దు. మంగళ, బుధ వారాల్లో అనుకోని సంఘటనలెదురౌతాయి. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. పిల్లల ఉన్నత చదువులపై దృష్టిపెడతారు. గృహమార్పు కలిసివస్తుంది. పత్రాలు రెన్యువల్లో అలక్ష్యం తగదు. నిర్మాణాలు మరమ్మతులు చేపడుతారు. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. ఉద్యోగ బాధ్యతల్లో తప్పిదాలను సరిదిద్దుకంటారు. ఉపాధ్యాయులకు పదోన్నతి, స్థానచలనం. న్యాయ, సేవ, వైద్య రంగాల వారికి ఆధాయాభివృద్ది. వ్యాపారాలు క్రమంగా ఊపందుకుంటాయి.

మిధునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్థ్ర, పునర్వసు 1,2,3 పాదాలు
పరిస్థితులు క్రమంగా మెరుగు పడుతాయి. మానసికంగా కుదుటపడుతారు. సంప్రదింపులకు అనుకూలం. మీ అభిప్రాయాలను స్పష్టంగా తెలియజేయండి. అనాలోచిత నిర్ణయాలు తగవు. మీ శ్రీమతి సలహా పాటించండి. ఖర్చులు విపరీతం. ఒక అవసరానికి ఉంచిన ధనం మరోదానికి వ్యయం చేస్తారు. అసాధ్యమనుకున్న పనులు తేలికగా పూర్తవుతాయి. గురు, శుక్ర వారాల్లో అపరిచితులతో జాగ్రత్త. బ్యాంకు వివరాలు వెల్లడంచవద్దు. గుట్టుగా యత్నాలు సాగించండి. సంతానం మొండితనం ఇబ్బంది కలిగిస్తుంది. అనునయంగా మెలగాలి. సన్నిహితులను కలుసుకుంటారు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. నిరుద్యోగులకు ఆశాజనకం. మార్కెట్ రంగాల వారికి మార్పులు అనుకూలిస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. దైవ సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.

కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
అర్థికలావాదేవీలు ముగింపునకొస్తాయి. సకాలంలో వాయిదాలు చెల్లిస్తారు. డబ్బుకు లోటు ఉండదు. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. కొత్త యత్నాలకు శ్రీకారం చుడుతారు. సన్నిహితులు ప్ర్రోత్సాహం ఉంటుంది. పనులు సానుకూలమవుతాయి. శనివారంనాడు ముఖ్యుల కలయిక వీలుండదు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. ఆత్మీయులకు సాయం అందిస్తారు. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. ఆస్తి వివాదాలు కొత్తమలుపు తిరుగుతాయి. సంతాన విజయం ఉత్సాహాన్నిస్తుంది. ఉద్యోగస్తులకు పదవీయోగం. రిటైర్డు ఉద్యోగస్తులకు వీడ్కోలు పలుకుతారు. వస్త్ర, బంగార, పచారీ వ్యాపారాలు ఊపందుకుంటాయి. సంస్థల స్థాపనకు అనుకూలం. నూతన వ్యాపారం కలిసివస్తాయి. స్టాక్ మార్కెట్ రంగాల వారికి మిశ్రమ ఫలితం.

సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
అనుకూలత అంతంతమాత్రమే. యాధృచ్చికంగా తప్పులు దొర్లే ఆస్కారం ఉంది. ఆలోచనలతో సతమవుతారు. ఆదాయ వ్యయాలకు పొంతన డండదు. ఆదివారం నాడు దుబారా ఖర్చులు విపరీతం. చేతిలో ధనం నిలవదు. పనులు మొండిగా పూర్తి చేస్తారు. ఆప్తుల కలయిక ఉపశమనం కలిగిస్తుంది. సంతానం కదలికపై దృష్టి పెట్టండి. ఏ విషయాన్ని తేలికగా తీసుకోవద్దు. మీ శ్రీమతి సలహా పాటించండి. సోదరులతో విభేదాలు తలెత్తుతాయి. పెద్దల జోక్యంతో సమస్య సద్దుమణుగుతుంది. వ్యాపారాలు అంతంతమాత్రంగా సాగుతాయి. సరకు నిల్వలో జాగ్రత్త. వృత్తుల వారికి సామాన్యం. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. అధికారులకు హోదా మార్పు, స్థానచలనం. వేడుకలు వినోదాల్లో అత్యుత్సాహం తగదు. ప్రయాణం అనుకూలించదు.

కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
సంప్రదింపులు ముందుకు సాగవు. వ్యవహారం బెడిసికొడుతుంది. మీ మాటతీరు అదుపులో ఉంచుకోండి. ఖర్చులు అదుపులో ఉండవు, డబ్బుకు ఇబ్బందిగా ఉంటుంది. సన్నిహితులు సాయం అందిస్తారు. ఒక సమస్య సానుకూలమవుతుంది. మంగళ, బుధ వారాల్లో పనులు సాగవు. ఆలోచనలతో సతమతమవుతారు. మీ శ్రీమతి సలహా పాటించండి. సంతానం విషయంలో శుభపరిణామాలున్నాయి. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. గుట్టుగా వ్యవహరంచండి. సలహాలు, సహాయం ఆశించవద్దు. మనోధైర్యంతో ముందుకు సాగండి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు పనిభారం. విశ్రాంతి లోపం. ఉపాధ్యాయులకు స్థానచలనం. విద్యార్థులకు దూకుడు తగదు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. ఆరోగ్యం సంతృప్తికరం. ప్రయాణం వాయిదా పడుతుంది.

తుల: చిత్త 3, 4 పాదాలు, స్వాతి ,విశాఖ 1, 2, 3 పాదాలు
ఈ వారం శుభదాయకం. వ్యవహారానుకూలత ఉంది. అనుకున్నది సాధిస్తారు. ఆదాయం సంతృప్తికరం, పొదుపు పథకాలపై దృష్టిపెడతారు. పెద్దమొత్తం ధనసహాయం తగదు. ఖర్చులు అధికం. ప్రయోజనకరం. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. రశీదులు జాగ్రత్త. పనులు తేలికగా పూర్తవుతాయి. శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. ఒక సమాచారం ఆలోచింప చేస్తుంది. ఆత్మీయులతో సంప్రదింపులు జరుపుతారు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. లైసెన్సులు, పర్మిట్ల రెన్యవల్లో మెలకువ వహించండి. ఆరోగ్యం మందగిస్తుంది. విశ్రాంతి అవసరం. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. వస్త్ర, బంగారం, ఫ్యాన్సీ వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఉద్యోగస్తులకు పదవీయోగం, ధనలాభం. అధికారులకు వీడ్కోలు పలుకుతారు. వాహనం ఇతరులకివ్వవద్దు.

వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనురాధ, జ్యేష్ట
ప్రతికూలత అధికం. తప్పటడుగు వేసే ఆస్కారం ఉంది. అనాలోచిత నిర్ణయాలు తగవు. సన్నిహితుల సలహా పాటించండి. గృహంలో స్తబ్దత నెలకొంటుంది. పనులు మొండిగా పూర్తిచేస్తారు. ఆదాయం సంతృప్తికరం. ఖర్చులు భారమనిపించవు. చెల్లింపులు, నగదు స్వీకరణలో జాగ్రత్త. బ్యాంకు వివరాలు వెల్లడించవద్దు.పిల్లల ఉన్నత చదువులపై దృష్టి పెడతారు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. కనిపించకుండా పోయిన పత్రాలు లభ్యమవుతాయి. అవగాహన లేని విషయాలకు దూరంగా ఉండాలి. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. వ్యాపారాలు ఊపందుకుంటాయి. హోల్ సేల్ వ్యాపారులకు పురోగాభివృధ్ది, ఉద్యోగ బాధ్యతల్లో మెలకువహించండి. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసి వస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు. ప్రయాణం సజావుగా సాగుతుంది.

ధనస్సు: మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాడ 1వ పాదం
లక్ష్యసాధనకు ఓర్పు, పట్టుదల ప్రధానం, మనోధైర్యంతో వ్యవహరించండి. ఆదాయం ఫర్వాలేదనిపిస్తుంది. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. వాయిదా పడిన పనులు పునఃప్రారంభిస్తారు. అవకాశాలను తక్షణం వినియోగించుకోండి. గురు, శుక్ర వారాల్లో అప్రమత్తంగా ఉండాలి. కొత్త సమస్యలు ఎదురయ్యే సూచనలున్నాయి. ఏవిషయాన్ని తేలికగా తీసుకోవద్దు. సన్నిహితుల సలహా పాటించండి. ప్రముఖుల సందర్శనం వీలుపడదు. గృహమార్పు అనివార్యం. పత్రాలు, నోటీసులు అందుకుంటారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. పిల్లల చదువుపై దృష్టి పెడతారు. కావలసిన వస్తువులు సమయానికి కనిపించవు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఉద్యోగస్తులకు యూనియన్ వ్యవహారాలతో తీరిక ఉండదు. రిటైర్డు ఉద్యోగస్తులకు వీడ్కోలు పలుకుతారు.

మకరం: ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
ఈ వారం ఆశాజనకం, తప్పిదాలను సరిదిద్దుకుంటారు. సమస్యలు సద్దుమణుగుతాయి. ఖర్చులు విపరీతం, విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. పనులు సానుకూలమవుతాయి. గృహం సందడిగా ఉంటుంది, ఆప్తులను విందుకు ఆహ్వానిస్తారు. ఒక సమాచారం ఉల్లాసం కలిగిస్తుంది. కుటుంబ సౌఖ్యం ప్రశాంతత పొందుతారు. మీ విషయాల్లో ఇతరుల జోక్యానికి అవకాశమివ్వవద్దు. గురు, శుక్ర వారాలల్లో బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. పరిచయాలు బలపడుతాయి. వ్యాపకాలు సృష్టించుకుంటారు. కొత్త ఆలోచనలు స్పురిస్తాయి. శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. దంపతుల మధ్య దాపరికం తగదు. ఉపాధ్యాయులకు స్థానచలనం. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. మీ పథకాలు సత్ఫలితాలిస్తాయి. ఆప్తుల క్షేమం తెలుసుకుంటారు. కీలక సమావేశాల్లో పాల్గొంటారు.

కుంభం: ధనిష్ట, 3, 4 పాదాలు,శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
చాకచక్యంగా వ్యవహరిస్తారు. అవకాశాలు కలిసివస్తాయి. సంప్రదింపులకు అనుకూలం. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. ఉల్లాసంగా గడుపుతారు. శనివారం నాడు పనుల ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. అపరిచితుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. ఖర్చులు విపరీతం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. దైవకార్యాలకు వ్యయం చేస్తారు. స్థిరాస్తి కొనుగోలు దిశగా ఆలోచిస్తారు. సంతానం, చదువులపై శ్రద్ధ అవసరం. ఆత్మీయులను విందులకు ఆహ్వానిస్తారు. పత్రాల రెన్యువల్లో మెలకువ వహించండి. విలువైన వస్తువులు మరమ్మతుకు గురవుతారు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. వ్యాపారాల్లో ఒడిదుడుకులను దీటుగా ఎదుర్కొంటారు. వృత్తుల వారికి సదవకాశాలు లభిస్తాయి. ఉద్యోగ బాధ్యతల్లో మెలకువ వహించండి. ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు.

మీనం: పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
అనుకూలతలున్నాయి. ఉత్సాహంగా ముందుకు సాగుతారు. అప్రయత్నంగా అవకాశాలు కలిసివస్తాయి. కొత్తయత్నాలకు శ్రీకారం చుడతారు. పనులు చురుకుగా సాగుతాయి. ధనలాభం ఉంది. ఆప్తులకు సాయం అందిస్తారు. ఆది, సోమ వారాల్లో నగదు, ఆభరణాలు జాగ్రత్త. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. ఏకపక్షంగా వ్యవహరించవద్దు. కుటుంబీకుల సలహా పాటించండి. ఎదురుచూస్తున్న పత్రాలు అందుకుంటారు. సంతాన విషయంలో శుభపరిణామాలున్నాయి. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. వస్త్ర, వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఉద్యోగస్తులకు బాధ్యతల మార్పు, అధికారులకు స్థానచలనం, ఆశావహ దృక్పథంతో ఉద్యోగయత్నాలు సాగించండి. దైవకార్యంలో పాల్గొంటారు. విద్యార్థులకు అత్యుత్సాహం తగదు.
       

Reactions

0 Comments:

Post a comment

Latest Jobs

More

Jobs Info

More
Top