Saturday, 11 July 2020

కరోనాకు దూరంగా ఇలా!

కరోనాకు దూరంగా ఇలా!

‘భవిష్యత్తులో కరోనా ముప్పును తప్పించుకోవాలంటే ప్రతి ఒక్కరూ ఈ 15 నియమాలు పాటిస్తామని ఎవరికి వారే వాగ్దానం చేసుకోవాలి..’ అనే క్యాప్షన్‌తో వీడియోను పోస్ట్‌ చేసింది ఆరోగ్య శాఖ. ఆ వాగ్దానాలేంటంటే..?

. కరచాలనం చేయము.. భౌతిక దూరం పాటిస్తూనే పలకరించుకుంటాం.
  1. . కనీసం ఆరడుగుల సామాజిక దూరం పాటిస్తాం.
  2. . ఇంట్లో తయారుచేసిన రీయూజబుల్‌ ఫేస్‌మాస్క్‌ వాడతాం.
  3. . కళ్లు, ముక్కు, నోటిని తాకే అలవాటు మానుకుంటాం.
  4. . శ్వాసకోశ సంబంధిత పరిశుభ్రత పాటిస్తాం. (అంటే దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు టిష్యూ అడ్డుపెట్టుకోవడం, చీదిన తర్వాత టిష్యూను మూత ఉన్న డస్ట్‌బిన్‌లో పడేయడం మొదలైనవి)
  5. . పదే పదే చేతులు శుభ్రం చేసుకుంటాం.8. పదే పదే తాకే ప్రదేశాలను క్రిమి సంహారక ద్రావణాలతో తరచూ శుభ్రం చేసుకుంటాం.
  6. . అనవసర ప్రయాణాలు చేయము.
  7. . గుంపులుగా ఉన్న ప్రదేశానికి వెళ్లము.
  8. . మొబైల్‌లో ఆరోగ్య సేతు యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకుంటాం.
  9. . కరోనా బాధితుల పట్ల వివక్ష చూపము.
  10.  కరోనాకు సంబంధించిన ఏ సమాచారాన్నైనా విశ్వసనీయమైన వర్గాలు, వెబ్‌సైట్స్‌ నుంచే తెలుసుకుంటాం. తప్పుడు సమాచారం ప్రచారం చేయము
  11.  పొగాకు, ఖైనీ.. వంటివి నమలము.. జనసంచారం ఉన్న ప్రదేశాల్లో వాటిని ఉమ్మివేయము.
  12.  జలుబు, దగ్గు, శ్వాసతీసుకోవడంలో ఏమైనా ఇబ్బంది ఎదురైతే జాతీయ టోల్‌ ఫ్రీ నంబర్‌ 1075కి లేదంటే రాష్ట్ర హెల్ప్‌లైన్‌ నంబర్లకు ఫోన్‌ చేస్తాం.



 ఒత్తిడి, ఆందోళనలు ఎదురైతే మానసిక నిపుణుల సహాయం తీసుకుంటాం.
ఇలా ఎవరికి వారే ప్రతిజ్ఞ చేసుకోవడమే కాదు.. మాటిచ్చి తప్పకూడదన్నట్లు ఈ వాగ్దానాలను తు.చ. తప్పకుండా పాటించాల్సిన బాధ్యత కూడా మనపైనే ఉంది. కాబట్టి వీటిని గుర్తుపెట్టుకుందాం.. కరోనా బారిన పడకుండా జాగ్రత్తగా ఉందాం..!
Reactions

0 Comments:

Post a comment

Latest Jobs

More

Jobs Info

More
Top